వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే సహజంగానే నల్లగా మారుతుంది!

వైట్ హెయిర్( White Hair ). ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య కనిపించేది.

 Natural Home Remedy To Get Rid Of White Hair!, White Hair, Black Hair, Hair Care-TeluguStop.com

కానీ ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి లో చోటు చేసుకున్న మార్పులు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.ఫలితంగా పాతికేళ్లకే చాలా మందికి జుట్టు తెల్లబడటం స్టార్ట్ అవుతుంది.

తెల్ల జుట్టు ముసలితనానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టు( Grey Hair ) ను కవర్ చేసుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

Telugu Black, Care, Care Tips, Pack, Remedy, Thick, White-Telugu Health

అయితే వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ తులసి ఆకులు, ఒక కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకోవాలి.చివరిగా తులసి పుదీనా జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గంట పాటు వదిలేయాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Black, Care, Care Tips, Pack, Remedy, Thick, White-Telugu Health

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టుతో టెన్షన్ అక్కర్లేదు.కలర్స్ పై ఆధార పడాల్సిన అవసరం కూడా ఉండదు.ఈ రెమెడీ వల్ల మీ జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.తెల్ల జుట్టు రాని వారు కూడా ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.తద్వారా జుట్టులో మెలనిన్ ఉత్పత్తి( Melanin ) తగ్గకుండా ఉంటుంది.

ఫలితంగా వయసు పైబడిన కూడా మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube