దర్శకధీరుడు రాజమౌళి ( Rajamouli )గురించి, ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు.
మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించి చాలా కాలం క్రితమే ప్రకటన వెలువడినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతోంది.అయితే రాజమౌళి జాతకం ప్రకారం ప్రస్తుతం ఏ పని చేసినా అనుకూల ఫలితాలు రావని తెలుస్తోంది.
2024 సంవత్సరం ఆగష్టు వరకు రాజమౌళి మహేష్( Mahesh Babu ) సినిమాను మొదలుపెట్టకుండా ఉంటే మంచిదని ప్రముఖ జ్యోతిష్కుడు రాజమౌళి కుటుంబ సభ్యులకు సూచనలు చేశారని సమాచారం అందుతోంది.ఈ విధంగా చేయకపోతే మాత్రం మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
రాజమౌళి ఈ జాతకాలను నమ్ముతారో లేదో చూడాల్సి ఉంది.కీరవాణి( M.M.Keeravani ) నమ్మే ప్రముఖ జ్యోతిష్కుడు రాజమౌళి జాతకాన్ని పరిశీలించారని సమాచారం అందుతోంది.జక్కన్న ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.రాజమౌళి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జక్కన్న సినిమాలకు సంబంధించి వేగం పెంచాలని అభిమానులు ఫీలవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేష్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి మహేష్ బాబు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి రెండేళ్లకు ఒక సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జక్కన్న భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.ఇతర భాషల్లో సైతం రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.