వేరుశెనగ పంటను ఆశించే పొగాకు లద్దె పురుగులను నివారించే పద్ధతులు..!

నూనె గింజల పంటలలో వేరుశెనగ పంట( Groundnut crop ) ప్రధానమైనది.వేరుశనగ పంట ను రబీ, వేసవిలో ఆరుతడి పంటగా అధికంగా విస్తీర్ణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు.

 Methods To Prevent Tobacco Leafhoppers From The Groundnut Crop , Tobacco, Ground-TeluguStop.com

ఈ పంటకు చీడపీడల బెడద అధికంగా ఉన్నా కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu Agriculture, Chloropyrifos, Fungi, Groundnut Crop, Latest Telugu, Tobacco

వేరుశెనగ పంట పూత దశ నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి.అయితే పొగాకు లద్దే పురుగులను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.పొగాకు( tobacco ) లద్దే పురుగులలో తల్లి పురుగులు ఆకుల పై భాగాన గుంపులుగా గుడ్లు పెడతాయి గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్ర హరితాన్ని గోకితిని వేసి ఆకును జల్లెడగా మారుస్తాయి.

ఉదయం, సాయంత్రం పంటను గమనిస్తే ఈ పురుగుల ఉనికి బయటపడుతుంది.పంట విత్తిన 20 రోజుల తర్వాత ఈ పురుగుల ఉనికిని పొలంలో గుర్తించాలి.

Telugu Agriculture, Chloropyrifos, Fungi, Groundnut Crop, Latest Telugu, Tobacco

వేసవికాలంలో లోతు దుక్కులు దున్నడం వల్ల ఎండ వేడికి, పంట అవశేషాలలో ఉండే శిలీంద్రాలు( Fungi ) నాశనం అవుతాయి.వేరుశెనగ పంటలో ఒక 50 ఆముదము, 50 పొద్దు తిరుగుడు మొక్కలను ఎరపంటలుగా నాటాలి.అక్కడక్కడ ఒక అడుగు ఎత్తులో ఓ పది పక్షిస్తావరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఈ పురుగుల గుడ్లు, ఈ పురుగుల సముదాయము ఆకులపై కనిపించిన వెంటనే పది కిలోల వేపగింజల పొడి ను రెండు వందల లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టి వడగట్టి ఒక ఎకరం పై రూపాయి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.

రసాయన పద్ధతిలో అయితే క్లోరోఫైరిఫాస్( Chloropyrifos ) 500 మి.లీ ను లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.బాగా ఎదిగిన లార్వాలు పెద్ద లద్దె పురుగుల నివారణకు 500మి.లీ, 1బెల్లం, తవుడు తో తయారు చేసుకున్న మిశ్రమాన్ని సాయంత్రం వేళలో చిన్న చిన్న ఉండలుగా చేసి పంటలో వెదజల్లితే ఈ పురుగులను నివారించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube