ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న 'ఖుషి' అడ్వాన్స్ బుకింగ్స్..స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ లేదుగా!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత( Vijay Deverakond ) జంటగా నటించిన ఖుషి సినిమా( Khushi movie ) సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా సిద్దమైంది.ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

 Advance Bookings Of 'khushi' Movie Which Is Gathering In Overseas Even Star He-TeluguStop.com

ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అనూహ్య స్పందన లభించడంతో థియేటర్లలో షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఖుషి సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే భారీగా వసూళ్లు అవుతున్నాయి.

పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న చిత్రం ఖుషి.తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకే కాలంలో రిలీజ్ అవుతోంది.

రిలీజ్ అవుతున్నది.ఇటు ఇండియా, అటు ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ తో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి.

Telugu Advance, America, Australia, Khushi, Samantha, Shiva Nirvana, Tollywood-M

ఖుషి సినిమా ఏపీ, నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.నైజాంలో మొత్తం 750 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైనాయి.ఇప్పటి వరకు 45 శాతం ఆక్యుపెన్సీతో రూ.2.7 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రాలో 900 షోలకు రూ.1.6 కోట్లు వసూలు చేయడంతో.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం రూ.4.3 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వసూలయ్యాయి.తర్వాత కన్నడ భాష విషయానికొస్తే.

కర్ణాటక వ్యాప్తంగా 260 షోలకు గాను 30 శాతం ఆక్యుపెన్సీతో బుకింగ్స్ అయ్యాయి.వాటి ద్వారా అక్కడ ఈ సినిమాకు రూ.40 లక్షలు, తమిళనాడులో 170 షోలకు గాను 25 శాతం ఆక్యుపెన్సీతో రూ.20 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి.

Telugu Advance, America, Australia, Khushi, Samantha, Shiva Nirvana, Tollywood-M

అటు ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీగా రెస్పాన్స్ వస్తుంది.ఆస్ట్రేలియా( Australia )లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.అక్కడ పలు ప్రాంతాల్లో కలిపి మొత్తం 73షోల కోసం 2200టికెట్లు అమ్ముడు పోయాయి.దీంతో 40వేల అమెరికా డాలర్లు(రూ.22లక్షలు) వసూళ్లు నమోదు అయ్యాయి.ఇటు అమెరికా( America )లో 809 షోలకు గాను 16 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.

దీంతో చిత్రానికి 3లక్షల అమెరికా డాలర్లు వసూలయ్యాయి.ప్రీమియర్ షోస్ మొదలయ్యే సరికి మన కరెన్సీలో సుమారు రూ.40లక్షలు వసూలయ్యాయి.మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఖుషి సినిమాకు ఇప్పటి వరకు దాదాపు రూ.4.5లు వసూలైనట్లు తెలుస్తోంది.ఓవర్సీస్‌ కలుపుకుంటే మరో కోటి వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube