తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి.గత కొన్నాళ్లుగా టి కాంగ్రెస్( Telangana Congress ) లో షర్మిల అంశం తరచూ చర్చకు వస్తోంది.
రాజన్న పాలనే లక్ష్యంగా తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.పాదయాత్రలు ప్రభుత్వంపై విమర్శలు వంటివి చేస్తూ అప్పుద్సప్పుడు హాట్ టాపిక్ అవుతున్నప్పటికి అనుకున్న స్థాయిలో ఆమె పార్టీకి మైలేజ్ రావడం లేదు మరోవైపు ఎన్నికలు దగ్గర పడడంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంగా లేకపోతే ముప్పు తప్పదని భావించి వ్యూహాత్మకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు అడుగులు వేస్తోంది.
అయితే షర్మిల రాకను కాంగ్రెస్ కూడా స్వాగతిస్తున్నప్పటికి.కాంగ్రెస్ తరుపున ఆమె ప్రాతినిథ్యం ఎక్కడ చేస్తే బాగుంటుందనే దానిపైనే అసలు చిక్కు.
ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలంటే సరైన నాయకత్వం అవసరం.దాంతో ఏపీలో షర్మిలను కాంగ్రెస్ బరిలో దించితే ఏ ఉంటుందనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.అయితే తాను తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని షర్మిల ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు.అయితే టి కాంగ్రెస్ కు షర్మిల పాత్ర అవసరం లేదని రేవంత్ రెడ్డి ( Revanth Reddy )వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమె దారి ఎటువైపు ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారిన అంశం.ఇక తాజాగా సోనియా గాంధీ( Sonia Gandhi )తో భేటీ అయిన షర్మిల పార్టీ విలీనంపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెను తెలంగాణ కాంగ్రెస్ లోనే కొనసాగించేలా అధిష్టానం ప్లాన్ చేస్తోందట.అన్నీ అన్నికున్నట్లు జరిగిగే పాలేరు నుంచి ఆమెను బరిలో దించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట.అయితే ఆమె టి కాంగ్రెస్ లో చేరితే పార్టీకి ముప్పే అని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఎందుకంటే గతంలో ఆమె టి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె మళ్ళీ కాంగ్రెస్ లోనే చేరితే ప్రజల్లో కాంగ్రెస్ పై అభిమానం సన్నగిల్లే అవకాశం ఉదందనేది కొందరు విలేషకులు చెబుతున్నా మాట.మొత్తానికి తన పార్టీ విలీనం పై షర్మిల ఎపిసోడ్ తుది అంఖానికి చేరుకున్నట్లే తెలుస్తోంది.