స్టూడెంట్స్‌కు డ్యాన్స్ ట్రైనింగ్.. గవర్నమెంట్ స్కూళ్లల్లో ఇలాంటివి చూసి ఉండరు..

ప్రభుత్వ పాఠశాలల్లో( Government schools ) వసతులు సరిగ్గా ఉండవు.అలాగే టీచర్ల కొరత, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించేందుకు వెనుకాడతారు.

 Dance Training For Students.. Such Things Have Not Been Seen In Government Schoo-TeluguStop.com

మంచి విద్య, అనుభవం కలిగిన టీచర్లు, వసతులు ఎక్కువగా ఉండే ప్రైవేట్ స్కూళ్లల్లో విద్యార్థులను జాయిన్ చేయించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారు.ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అయినా సరే.చదువు బాగా చెప్పే ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్పిస్తారు.ప్రైవేట్ స్కూళ్లల్లో విద్యార్థులకు చదువునే కాకుండా డ్యాన్స్, డ్రాయింగ్ లాంటివి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు.

కానీ ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థులకు ఒక టీచర్ డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాడు.డ్యాన్స్ ప్రొగ్రాంలు, ఫంక్షన్లు అనేవి ప్రైవేట్ స్కూళ్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.కానీ ప్రభుత్వ పాఠశాలలోనూ ఒక ప్రొగ్రాం కోసం కొంతమంది విద్యార్థులకు టీచర్ డ్యాన్స్ నేర్పిస్తున్నాడు.దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోలో టీచర్ డ్యాన్స్ నేర్పిస్తుండగా.పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది.ప్రియా సింగ్( Priya Singh ) అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.58 సెకన్లపాటు ఈ వీడియో ఉండగా.ఇప్పటివరకు 12 వేల మంది వీక్షించారు.

ఈ వీడియెకు నెటిజన్లు అనేక కామెంట్స్ పెడుతున్నారు.ఏ టీచర్ కు అయినా సరే సమయం దొరికినప్పుడు స్టూడెంట్స్ కు తమ అభిరుచి మేరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.అలాగే విద్యార్థుల్లోని టాలెంట్ కు తగిన ప్రోత్సాహం అందించాలని చెబుతున్నారు.

ఖరీదైన ప్రైవేట్ స్కూళ్లల్లో( Private schools ) మాత్రమే డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటే పొరపాటు అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సన్నివేశాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్లల్లో కూడా డ్యాన్స్, డ్రాయింగ్ ట్రైనింగ్ లాంటివి ప్రవేశపెట్టాని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube