ఎప్పుడైతే సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి( Venuswamy ) చాలామంది నటీనటుల జ్యోతిష్యాలు చెబుతూ ఫేమస్ అయ్యారో అప్పటినుండి కొంతమంది ట్రోలర్స్ అయితే ఆయన జాతకం చెప్పని వారి పేర్లను కూడా సోషల్ మీడియాలో కావాలనే వైరల్ చేస్తూ వేణు స్వామి వీరి జాతకం ఎలా ఉందో చెప్పారు అంటూ లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు.తాజాగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ( Allu ayan ) జాతకం కూడా వేణు స్వామి చెప్పారని,ఆయన జాతకంలో చాలానే దోషాలు ఉన్నాయని అంటూ ఒక వార్తను వైరల్ చేశారు.
ఇక అల్లు అర్జున్ జాతకంలో ఉండే ఆ దోషాలు ఏంటి.ఆయన రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అనే వార్త ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అల్లు అయాన్ జాతకం ఎవరు చూడకపోయినప్పటికీ కావాలనే కొంతమంది అల్లు అర్జున్( Allu arjun ) కి అవార్డు రావడంతో ఓర్వని వాళ్ళు అల్లుఅయాన్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ కొడుకు జాతకం లో పెద్ద దోషం ఉందని, ఆయన జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు చేసుకుంటారనే వార్తలు వైరల్ చేస్తున్నారు.
అంతేకాదు రామ్ చరణ్ కూతురు క్లింకార పుట్టినప్పుడే రామ్ చరణ్( Ram charan ) అల్లు అర్జున్ బావ బావమరిదిలు అవుతారని లింక్ కలిపారు.అల్లుఅయాన్ క్లింకారా కి పెద్దయ్యాక పెళ్లి చేస్తారు అంటూ లింకులు ముడిపెట్టారు.ఇక మెగా ఫ్యామిలీలో కూతుర్లను పెళ్లి చేసుకుంటే ఎవరైనా సరే విడాకులు తీసుకోవాల్సిందే కాబట్టి పెళ్లి జీవితం కూడా ఎక్కువ రోజులు ఉండదు.
వీరి జీవితం కొన్ని రోజులు సాగాక అల్లుఅయాన్ కి క్లీంకారా( Klinkaara ) విడాకులు ఇచ్చేస్తుంది.దీంతో అల్లుఅయాన్ కూడా కొన్ని రోజులు ఒంటరిగా ఉండి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాడు.ఈయన జాతకంలో జరగబోయేది ఇదే అంటూ కొంతమంది నెటిజన్స్ కావాలనే ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వార్తలపై అల్లు అర్జున్ టీం స్పందించి యాక్షన్ తీసుకోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.