రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయిన్పల్లి మండల కేంద్రంలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి పుష్పలత కు వారి సమస్యలు తీర్చాలని శనివారం వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18000 అమలు చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్ చేయాలని, గతంలో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లకు పని భారం విపరీతంగా పెరిగిందనీ పారితోషకంతో పాటు పారితోషకాలు లేని అనేక పనులను ప్రభుత్వం ఆశలతో చేయిస్తున్నదనీ అన్నారు.
ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సబ్ సెంటర్స్, బస్తీ దావకానల్లో పనిచేయాలని చెబుతున్నది.ఆశ వర్కర్లకు సాధారణ భీమా, ప్రమాద బీమా సౌకర్యం( Accident Insurance ) కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అలాగే ఆశ వర్కర్లకు బస్సు పాసులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందనీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్, మండల ఆశా వర్కర్లు చంద్రకళ, లత, శ్రీలత, లక్ష్మి, అనిత, అన సూర్య, శారద తదితరులు పాల్గొన్నారు.