హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది.డ్రైవర్ అత్యుత్సాహంతో ఆటో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి.వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ముందు వెళ్తున్న బైకును తప్పించబోయి ఆటో బోల్తా పడింది.కాగా ఈ ప్రమాదానికి ఆటో డ్రైవర్ అతివేగమే కారణమని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.