తెలుగులో ఉన్న హీరోలందరితో మంచి సానిహిత్యం ఉండే ఒకే ఒక నటి మంచు లక్ష్మి( Actress Manchu Lakshmi ) ఈమె అటు హీరోయిన్ గా, విలన్ గా నటిస్తూనే సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తూ ఉంటుంది ఇక దానికి తగ్గట్టు గా కొన్ని షో లకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది…అయితే ఇప్పుడు ఈమె మళ్లీ ఒక పెద్ద హీరో సినిమాలో నటిస్తుంది అంటూ టాక్ వస్తుంది చాలా రోజుల నుంచి నటన కి దూరం గా ఉంటున్న ఈమె ఒక మంచి క్యారెక్టర్ దొరకడం తో నటించడానికి ముందుకు వచ్చినట్టు గా తెలుస్తుంది.ఇంతకు ఈమె ఏ సినిమాలో నటిస్తుంది అంటే ఆమె కి మలయాళం( Malayalam ) లో ఒక డైరెక్టర్ నుంచి ఆఫర్ రావడం తో రీసెంట్ గా ఒక కథ విన్నదట ఆ కథ ఆమెకి బాగానచ్చిందట ఇక దానితో పాటు ఆమె క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉందట, దాంతో ఆ సినిమాలో చేస్తాను అని ఆ డైరెక్టర్ కి మాట కూడా ఇచ్చిందట ఇక మంచు లక్ష్మి మొన్నటిదాకా తెలుగు లో తన నటన తో అదరగొడితే ఇప్పుడు మలయాళ ప్రేక్షకులను తన నటన తో మ్యాజిక్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా లో తను నటించి ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తను అక్కడే సెటిల్ అయిన ఆశ్చర్య పోనవసరం లేదు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…నిజానికి మంచు లక్ష్మి కూడ మోహన్ బాబు( Mohan Babu ) లాగ మంచి ఆక్టర్ అయిన కూడా ఆమెకి తెలుగులో మంచి క్యారెక్టర్లు పడలేదని చెప్పాలి అందుకే ఆమె నటన పూర్తి స్థాయి లో బయిటికి రాలేదు లేకపోతే తను ఒక లేడి విలన్ గా సూపర్ గా సెట్ అయ్యేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…మంచు లక్ష్మి కి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఇప్పుడు ఎలాగైతే వరలక్ష్మి శరత్ కుమార్ ఒక లేడి విలన్ గా రాణిస్తుందో తనుకూడా అంతటి పేరు తెచ్చుకునేది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు…