వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, జేడీయూ, తృణమూల్, డీఎంకే వంటి ప్రధాన పార్టీలు ఉండడంతో అందరి దృష్టి కూటమిపై పడింది.
అయితే కూటమిగా ఏర్పడిన కొద్ది రోజులకే ఒక్కొక్కటిగా లొసుకుగులు బయట పడుతున్నాయి.ఇంతకీ అసలు విషయమేమిటనే ఆప్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్( Arvind Kejriwal ) కూటమి నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు నేషనల్ పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది.
డిల్లీలోని అన్నీ లోక్ సభ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించి కూటమికి షాక్ ఇచ్చిన కేజ్రివాల్.
ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమితో సంబంధం లేకుండా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారట.ఇదే ఇప్పుడు ఇండియా కూటమిని కలవర పెడుతున్న అంశం.ముఖ్యంగా కూటమిలో ప్రతినిత్యం వహిస్తున్న కాంగ్రెస్ కు ఇది ఏ మాత్రం మింగుడు పడని విషయం.
ఎందుకంటే రాజస్తాన్, మద్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆప్ స్వతంత్రంగా బరిలోకి దిగితే కాంగ్రెస్( Congress party ) కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.రాజస్తాన్( Rajasthan ) లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆప్ కూడా ఒంటరిగా బరిలోకి దిగితే హస్తం పార్టీ ఓటు బ్యాంక్ లో బారిగా చీలిక ఏర్పడే అవకాశం ఉంది.అటు మద్య ప్రదేశ్ లో కూడా ఇదే రిపీట్ అవుతుంది.
అందుకే అసలు ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిలో కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు కాంగ్రెస్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయట.డిల్లీ ఆర్డినేస్న్ విషయంలో ఆప్ కు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఇండియా కూటమితో ఆమ్ ఆద్మీ చేతులు కలిపింది.కానీ విపక్షాల మద్దతు ఎంత కూడగట్టిన డిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయింది.దీంతో కూటమిలో ఉన్న ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయంతో కేజ్రివాల్ ఉన్నడట.అందుకే కూటమి నుంచి వీలైనంత త్వరగా బయటకు వచ్చేందుకు కేజ్రివాల్ ప్లాన్ చేస్తునట్లు నేషనల్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.మొత్తానికి కూటమి నుంచి ఆప్ వాకౌట్ చేస్తే ఆ ప్రభావం కాంగ్రెస్ పై గట్టిగా చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.