అక్కినేని అఖిల్( Akkineni Akhi l) ప్రస్తుతం యంగ్ హీరోలలో ఒకరిగా ఉన్నప్పటికీ స్టార్ట్ డం సంపాదించుకోవడానికి మాత్రం నానా కష్టాలు పడుతున్నారు.అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కొంతమంది హీరోలు తమ సత్తా చాటుతూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటే ఎంతో పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ మాత్రం ఎదగలేకపోతున్నారు.
దానికి కారణం ఆయన సినిమాలు ఎంచుకునే తీరులో ఉందో లేక ఆయన ను దర్శకులు సరిగ్గా వాడుకోవడం లేదో తెలియదు కానీ ఈయన నటించిన సినిమాలు ఒక్కటి కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేదు.అయితే ఓ డైరెక్టర్ నాగార్జున ఇంటికి వెళ్లి అఖిల్ తో సినిమా చేస్తాను అంటే అమల (Amala) మొహం మీదే తలుపు వేసిందట.
మరి అలా ఎందుకు వేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకుడు శివ నాగేశ్వరరావు( Shiva Nageshwar rao ) నాగార్జున అమల కాంబినేషన్లో వచ్చిన శివ( Shiva ) సినిమాకి దర్శకత్వం వహించడంతో వారి ఫ్యామిలీతో డైరెక్టర్ కి మంచి అనుబంధం ఏర్పడింది.అయితే ఓ రోజు ఆయన ఇంగ్లీష్ కథను అనుసరించి తెలుగులో దానికి సంబంధించిన స్టోరీ రాసుకొని సినిమా తీయాలని భావించారట.ఇందులో భాగంగా నాగార్జున ( Nagarjuna)ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా అమల తీసిందట.
దాంతో శివ నాగేశ్వరరావు మీకొడుకు అఖిల్ ని నా నెక్స్ట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయాలనుకుంటున్నాను అని అడిగితే అమల ఆన్సర్ కూడా ఇవ్వకుండా మొహం మీదే తలుపేసిందట.కానీ ఆ తర్వాత నాగార్జున దగ్గరికి వెళ్లి డైరెక్టర్ ఈ విషయం చెబితే నాగార్జున ఓకే చేశారట.కానీ అమల (Amala) మాత్రం 8 నెలల అబ్బాయితో సినిమా ఎలా అని అడిగినప్పటికీ నాగార్జున మాత్రం ఏం కాదు చేయనిద్దామని అమలతో అన్నారట ఇక ఈ సినిమానే సిసింద్రీ.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలా సిసింద్రీ ( Sisindri ) సినిమాతో అఖిల్ బాల నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.