యూఎస్ మెరైన్ కార్ప్స్‌లో పట్టభద్రుడైన సిక్కు యువకుడు.. తలపాగా, గడ్డంతోనే ట్రైనింగ్

అమెరికా చరిత్రలో తొలిసారిగా 21 ఏళ్ల సిక్కు యువకుడు ఆ దేశంలోని ‘‘ ఎలైట్ యూఎస్ మెరైన్ కార్ప్స్’’( Elite US Marine Corps ) రిక్రూట్ ట్రైనింగ్ నుంచి పట్టభద్రుడయ్యాడు.సిక్కు మతంలో అత్యంత పవిత్రంగా భావించే తలపాగా, గడ్డాన్ని తీయకుండానే ఆయన ఈ ఘనత సాధించారు.

 Sikh Recruit Graduates From Elite Us Marine Corps With Turban, Beard , Us Marine-TeluguStop.com

సైనిక సేవకు, రిక్రూట్‌మెంట్‌కు మతపరమైన ఆచారాలు, విశ్వాసాలు అడ్డుగోడలు కాకూడదని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫెడరల్ జడ్జి ఆదేశించారు.ఈ నేపథ్యంలో జస్కీరత్ సింగ్ శుక్రవారం శాన్ డియాగోలోని మెరైన్ కార్ప్స్ రిక్రూట్‌మెంట్ డిపోలో తన శిక్షణను పూర్తి చేసి చరిత్ర సృష్టించినట్లు ది వాషింగ్టన్ టైమ్స్ నివేదించింది.

ముగ్గురు సిక్కులు, యూదులు, ముస్లిం అభ్యర్ధులు తమకు మతపరమైన వెసులుబాటు కోరుతూ మెరైన్ కార్ప్స్‌పై దావా చేసిన దాదాపు ఏడాది తర్వాత న్యాయమూర్తి నుంచి ఈ ఉత్తర్వు రావడం విశేషం.

Telugu Beard, Federal Appeals, Jaskeerat Singh, Sikh Graduates, Sikhgraduates, M

సైన్యం, వైమానిక దళం ఇప్పటికే సిక్కు వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.సిక్కు కూటమికి చెందిన న్యాయవాది గిసెల్లె క్లాపర్( Giselle Clapper ) మాట్లాడుతూ.నౌకాదళం సిక్కులకు పరిమిత వసతిని అందిస్తుండగా, మెరైన్ కార్ప్స్‌లో మాత్రం ఇది అత్యంత పరిమితమని చెప్పారు.

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

Telugu Beard, Federal Appeals, Jaskeerat Singh, Sikh Graduates, Sikhgraduates, M

ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ గతేడాది జస్కీరత్ సింగ్‌కు( Jaskeerat Singh ) అనుకూలంగా తీర్పును వెలువరించింది.దీని ప్రకారం సింగ్ తలపాగా ధరించి, గడ్డం తీయకుండానే శిక్షణను తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.శిక్షణ సందర్భంగా తన సహచరులు, నా మత విశ్వాసాలకు మద్ధతుగా నిలిచారని సింగ్ తెలిపారు.గౌరవం, ధైర్యం, నిబద్ధత, సేవల కారణంగా తాను యూఎస్ మెరైన్ కార్ప్స్‌ను ఎంచుకున్నానని జస్కీరత్ చెప్పారు.

అయితే కోర్ట్ ఉత్తర్వులు కేవలం సింగ్‌ను మాత్రమే కవర్ చేసింది.కానీ సిక్కు రిక్రూట్‌లందరికీ మెరైన్ కార్ప్స్‌లో శిక్షణ తీసుకునేందుకు వీలు కలుగుతుందని న్యాయవాది క్లాపర్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube