నేటి దైనందిత జీవితంలో నెలవారీ బిల్స్ అనేవి సామాన్యుడి నడ్డి విరుస్తున్న పరిస్థితి.ఒక్కోసారి మనకు కరెంటు బిల్లు అంత ఎక్కువ ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా అర్ధం కాదు.
మన సర్కార్లు పధకాల రూపంలో ఇలా డబ్బులు ఇస్తూనే అలా బిల్స్ రూపంలో వెనక్కి లాగేసుకుంటారు.ఆ విషయం మన వెర్రి జనానికి అంత చెప్పినా అర్ధం కాదు.
అయితే వందల్లో, వేళల్లో బిల్ వస్తే అదొక చర్చ అనుకుంటే….ఒకమెకి ఫోన్ బిల్లు( Phone Bill ) ఏకంగా కోట్లలో వచ్చింది.
ఏంటి షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే.
మనం అనేక సార్లు ఫోన్ , కరెంటు బిల్లులు కాస్త ఎక్కువ వస్తే ఖర్చులను అదుపు చేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటాం.ఎందుకంటే అది మన బడ్జెట్ పరిధిలోనే ఉండాలి గనుక.అయితే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సెలీనా అనే మహిళ తనకు వచ్చిన ఫోన్ బిల్లు చూసి అమాంతం మూర్ఛపోయినంత పనైంది.అవును, ఆమెకి ఏకంగా ఆమెకు రూ.1.65 కోట్ల ఫోన్ బిల్లు వచ్చింది.అది తను కలలో కూడా అనుకోలేదని, ఊహించని విధంగా భారీ మొత్తంలో వచ్చిన బిల్లుపై సెలీనా తన సర్వీస్ ప్రొవైడర్ T-మొబైల్( T Mobile Service Provider ) కి కాల్ చేసి వివరించింది.
కాగా, సదరు టి- మొబైల్ సంస్థ కూడా బిల్లు సరైనదేనని వాదించడంతో ఆమె షాక్ కి గురైంది.
కాగా ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.విషయం ఏంటంటే.వాస్తవానికి ఈ బిల్లు $201,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.1.65 కోట్లు.టెక్స్ట్, డేటా కమ్యూనికేషన్‌పై ఆధారపడిన వికలాంగులైన తన ఇద్దరు సోదరులతో సెలీనా తన ఫోన్ బిల్లును షేర్ చేసుకునేది.ఆమెకి సాధారణంగా ఫోన్ బిల్లు గరిష్టంగా £130 (రూ.13,715.14) మాత్రమే వచ్చేది.కాగా సడెన్ గా ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావటం చూసిన సెలీనా కంపెనీ ప్రతినిధులను నిలదీసింది.ఇలా ఎలా వేస్తారంటూ గట్టిగానే నిలదీసింది.దానికి వారు ససేమిరా అని అనడంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది.మీడియా సంస్థ( Media ) జోక్యం చేసుకోవడంతో సెలీనా ఉపశమనం పొందింది.