బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాగా రాజమౌళి ఈ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.ఈ సినిమాలను సక్సెస్ చేయడానికి జక్కన్న పడిన కష్టం అంతాఇంతా కాదు.
ఈ సినిమాల గురించి నూటికి 99 శాతం మంది నెగిటివ్ కామెంట్లు చేయరు.బాహుబలి సినిమాను బోడి సినిమా అంటే రాజమౌళి కానీ, ప్రభాస్ అభిమానులు కానీ ఏ స్థాయిలో ఫీలవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కీరవాణి భార్య వల్లి( Keeravani Wife Valli ) రాజమౌళితో ఈ కామెంట్లు చేశారట.బాహుబలి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి హీరో నాని( Hero Nani ) మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.బాహుబలి విడుదలైన సమయంలో రాజమౌళి కుటుంబం బళ్లారిలో ఉన్నారని నేను అదే సమయానికి వాళ్ల ఇంటికి వెళ్లగా అక్కడికి దగ్గర్లో ఒక థియేటర్ లో బాహుబలి సినిమా( Baahubali Movie ) ఆడుతోందని నాని చెప్పుకొచ్చారు.
ఆ సినిమాకు మళ్లీ వెళ్దామా అని రాజమౌళి అడగగా వల్లిగారు వెంటనే తీశావుగా బోడి సినిమా మళ్లీ చూస్తామా వెళ్లి అని అన్నారని నాని వెల్లడించారు.
నాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.రాజమౌళి నాని కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.మహేష్ రాజమౌళి కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.