తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ( Schools ) రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈనెల 29, 30 తేదీలలో గ్రూప్-2 పరీక్షలు ( Group 2 Exams )నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC ) ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీంతో 29 30 తారీకులలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఎందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేస్తున్నారు.
రెండు రోజులలో నాలుగు పేపర్లకు పరీక్షలు నిర్వహించబోతున్నారు.సరిగ్గా పరీక్షకు వారం రోజులు ముందు వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో( Telangana ) కురిసిన ఎడతెరిపి వర్షాలకు సెలవులు ప్రకటించడం తెలిసిందే.
తెలంగాణలో అన్ని విద్యాసంస్థలతో పాటు స్కూల్స్ కి సెలవులు ఇచ్చారు.వర్షాలు భయంకరంగా పడటంతో వరదలు గ్రామాలలోకి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
అయితే ఇప్పుడు మరోసారి గ్రూప్ 2 పరీక్షలు నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పాఠశాలల విద్యార్థులు ఫుల్ ఆనందంగా ఉన్నారు.