Chakrapani Sr Ntr :ఎన్టీఆర్ ఆ పాత్ర చేయకుండా ఆపేందుకు చక్రపాణి విశ్వ ప్రయత్నం.. చివరికి ఏమైందంటే…

ఆలూరి చక్రపాణి రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్న తెలుగు సినిమా నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకుడు.ఈ దిగ్గజ సినీ కళాకారుడు నాగిరెడ్డితో కలిసి సినిమా నిర్మాణ రంగంలో మన విజయాలను సాధించాడు.

 Why Chakrapani Tried To Stop Ntr-TeluguStop.com

విజయ వాహిని జంటగా ఏర్పడిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ నాగిరెడ్డితో కలిసి పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, షావుకారు, అప్పు చేసి పప్పు కూడు వంటి కళాఖండాలను తెలుగు ప్రేక్షకులకు ప్రసాదించాడు.తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా, హిందీ భాషల్లో 35 సినిమాలు చేశాడు.

ఈరోజు అంటే ఆగస్టు 5న చక్రపాణి ( Chakrapani )జయంతి సందర్భంగా ఆయనకు, భీష్మ సినిమా( Bhishma ) డైరెక్టర్ బి.ఏ సుబ్బారావు మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒకరోజు సుబ్బారావు హడావిడిగా చక్రపాణి వద్దకు వచ్చి.“అన్న, ఎన్టీఆర్‌కి భీష్ముడి గెటప్ వేసా.ఆ అవతారంలో అద్భుతంగా ఉన్నాడు.అస్సలు గుర్తు పట్టలేనంతగా మేకోవర్ చేశాను.

రామారావును మేం కాదు మీరూ గుర్తు పట్టలేరు తెలుసా!” అని హడావుడిగా చెప్పేశాడు.గుర్తుపట్టలేనంతగా ఉన్నప్పుడు రామారావు కాకుండా నువ్వే ఆ పాత్ర చేసేయొచ్చు కదా అని చక్రపాణి సరదాగా ఓ మాట విసిరారు.

Telugu Subba Rao, Bhishma, Chakrapani, Pingali, Sr Ntr, Tollywood-Movie

ఈ ఘటన కంటే ముందు జరిగిన కొన్ని ఘటనలు ఉన్నాయి.భీష్మ సినిమాలో ఎన్టీఆర్ ని భీష్ముడు పాత్రలో చూపించాలని మొదటగా నాగిరెడ్డికే డైరెక్టర్ సుబ్బారావు చెప్పారు.సంగతి తెలియగానే చక్రపాణి వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి పిలిపించారు.అనంతరం చక్రపాణి రామారావుతో మాట్లాడుతూ “ఆ బీఏ సుబ్బారావు రేపో ఎల్లుండో నీ దగ్గరికి వస్తాడు.

వచ్చి భీష్ముడి కథ తీస్తా.నువ్వేస్తావా అని అడుగుతాడు… ఒప్పుకోకు” అన్నారు.

అది విన్న రామారావు కాస్త షాక్ అయ్యారు.భీష్ముడి పాత్ర మంచిదే కదా ఎందుకు వద్దు అనడం అని ప్రశ్నించారు.

అయితే భీష్ముడిది డి-గ్లామర్ పాత్ర అని, అదొక ముసలి వేషం అని, పాటలు, కామెడీ గట్రా ఏమీ ఉండదని, దీనివల్ల కెరీర్ కి ఒరిగేది శూన్యమని చెబుతూ అతడిని ఆ పాత్ర చేయకుండా చేయాలని చక్రపాణి ప్రయత్నించారు.ఆయన చెప్పే మాటలను శ్రద్దగా ఉన్న రామారావు సర్లేండి నేను బీఏ సుబ్బారావు గారితో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారు.

దాన్ని బట్టి రామారావు భీష్ముడి పాత్ర వేయాలని నిర్చయించుకున్నట్లు చక్రపాణికి అర్థమయ్యింది.దాంతో ఎన్టీఆర్ ను ఎలా ఆపాలో ఆయనకు తెలియలేదు.

Telugu Subba Rao, Bhishma, Chakrapani, Pingali, Sr Ntr, Tollywood-Movie

అప్పుడే రైటర్ పింగళి( Pingali ) తన వద్దకు వచ్చారు.రామారావు ఒక వితండం మనిషి అని, ఆ సినిమా చేయొద్దని మీరేనా చెప్పండి అంటూ పింగళిని కోరారు.“వితండం మనిషి అని మీరే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాక నేను చెప్పడం అస్సలు భావ్యం కాదు ” అని పింగళి తెలివిగా తప్పుకున్నారు.అంతటితో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

కొద్ది రోజులకు రామారావు భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.భీష్ముని పాత్ర అతని పోషించిన అతికొద్ది గొప్ప పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube