దేశంలో ఆకలితో( Hunger ) అలమటిస్తున్న వాళ్లు లక్షల సంఖ్యలో నటిస్తున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికం తగ్గించడానికి ఎంతో కృషి చేస్తున్నాయి.
అయినప్పటికీ ఖర్చులు పెరుగుతుండటం వల్ల చాలామంది ఒక పూట తిని మరో పూట పస్తులుండటం గమనార్హం.అయితే జ్యోతికుమారి( Jyoti Kumari ) అనే మహిళ 17 ఏళ్లుగా లక్షల మంది ఆకలిని తీర్చడం ద్వారా వార్తల్లో నిలిచారు.
దివిసీమ ఉప్పెన రోజుల సమయంలో జ్యోతికుమారి ఆకలి కష్టాలను అనుభవించారు.
ఆ కష్టాలను చూసి చలించిపోయిన జ్యోతికుమారి తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు.
విజయవాడకు( Vijayawada ) చెందిన తెల్లగడ్డ జ్యోతికుమారి దివిసీమ ఉప్పెన సమయంలో సామాన్య కుటుంబాలు అనుభవించిన కష్టాలను కళ్లారా చూశారు.పేదల ఆకలి తీర్చడానికి ఏమైనా చేయాలని 2006 సంవత్సరంలో జ్యోతి కుమారి అన్నపూర్ణ ట్రస్ట్ ను మొదలుపెట్టారు.
జ్యోతికుమారి భర్త శ్రీనివాస్( Srinivas ) ఆర్టీసీలో కంట్రోలర్ గా పని చేస్తున్నారు.మొదట్లో పేదలకు స్వయంగా ఆమే వండిపెట్టేవారు.ఎవరైనా ఆర్థిక సాయం చేస్తామని చెప్పినా సరుకుల రూపంలో ఇవ్వాలని ఆమె కోరేవారు.బాబు ఇంజనీర్ అని అమ్మాయి, అల్లుడు డాక్టర్లు అని రోజుకు 1000 నుంచి 1200 మంది ఆకలి తీరుస్తున్నామని ఆమె వెల్లడించారు.
హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని సేకరిస్తూ ఆ ఆహారాన్ని పేదలకు అందేలా ఆమె చేస్తున్నారు.
పుష్కరాలు, దసరా ఉత్సవాలకు వచ్చే వాళ్ల ఆకలిని తీర్చే బాధ్యతను సైతం ఆమె తీసుకుంటున్నారు.జ్యోతికుమారి తను చేస్తున్న సేవలకు ఎన్నో అవార్డులను అందుకున్నారు.పేదలకు ఆహారం అందించడంతో పాటు ఆమె ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
దివ్యాంగ పిల్లలకు ఆహారం, పరికరాలు అందిస్తూ, అనాథ వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు అందిస్తూ గో శాలలకు సైతం ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.ఆమె మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.