వంకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

మనలో చాలా మంది వంకాయను( Brinjal ) ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.వంకాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

 Know These Health Benefits Of Adding Brinjal To Your Diet Details, Health Benef-TeluguStop.com

అయితే వంకాయలు తింటున్న సమయంలో స్కిన్ ఎలర్జీ( Skin Allergy ) లాంటి సమస్యలు వేధిస్తే మాత్రం వంకాయలకు దూరంగా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.వారంలో ఒకసారి వంకాయను ఆహారంలో భాగంగా తీసుకున్న హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

వంకాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి.వంకాయలు తినడం వల్ల ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి1, విటమిన్ బి3 లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో వంకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.శరీరంలో కొలెస్ట్రాల్( Cholestrol ) స్థాయిలను తగ్గించడంలో వంకాయలు సహాయపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.నిద్రపోవడానికి నాలుగు గంటల ముందు కాల్చిన వంకాయలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వంకాయల ద్వారా ఫైబర్ పిండి పదార్థాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.వంకాయల ద్వారా శరీరానికి అవసరమైన పొటాషియం( Potassium ) లభిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే విషయంలో వంకాయలు తోడ్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే శరీరంలో అదనపు ఐరన్ ను తొలగించడంలో వంకాయలు ఉపయోగపడతాయి.శరీరంలోని విష పదార్థాలను వంకాయ తొలగిస్తుంది.

ఉబ్బరం, పేగు సంబంధిత సమస్యలను తొలగించడంలో వంకాయలు సహాయపడతాయి.చర్మంపై ముడతలు లేకుండా చేయడంలో వంకాయ ఉపయోగపడుతుంది.

నిద్రలేమి సమస్యల తో బాధ పడే వాళ్ళు వంకాయలు తీసుకుంటే ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube