వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు క్లీన్ స్వీట్ చేయాలనే పట్టుదలతో ఉంది ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) 175 స్థానాలకు 175 గెలుచుకుని తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది.గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని , తమ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని , మళ్ళీ తమకే ఓటు వేస్తారనే నమ్మకంతో జగన్( CM Jagan ) ఉన్నారు.
దీంతో పాటు తనను తరచుగా విమర్శిస్తూ, ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూ వస్తున్న టిడిపి , జనసేన లను ప్రధానంగా జగన్ టార్గెట్ చేసుకున్నారు.ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అధినేతలను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.
దీనిలో భాగంగానే చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఈ జిల్లాకు చెందిన వైసిపి సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.ఇప్పటికే ఈ నియోజకవర్గంలో టిడిపి కీలక నేతలందరిని వైసీపీలోకి తీసుకురావడంలో రామచంద్ర రెడ్డి సక్సెస్ అయ్యారు.అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కుప్పం నియోజకవర్గంలో( Kuppam ) వైసిపి సత్తా చాటుకుంది.
కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకుని టిడిపికి షాక్ ఇచ్చింది.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి తీరుతామనే పట్టుదలను కనబరిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి లక్ష మెజారిటీతో గెలవాలని చంద్రబాబు కూడా టార్గెట్ పెట్టుకున్నారు.దీనిలో భాగంగానే మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు.
అలాగే అక్కడ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు.
అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.టిడిపికి కుప్పం గుండెకాయ వంటిదని, ఇక్కడ గెలవకపోతే తన పరపతి , టిడిపి పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.అందుకే ఈ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.టిడిపిలోని అసంతృప్తులను గుర్తించి వారిని బద్దగించే ప్రయత్నం చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని , అప్పుడు ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు.
అయితే చంద్రబాబుకు అవకాశం ఉండకకుండా చేసేందుకు ఈ నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరవేసి రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పరువు కు గండి కొట్టాలనే ఆలోచనతో వైసిపి వ్యూహాలు రచిస్తోంది.అందుకే కుప్పం నియోజకవర్గం రెండు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.