గూగుల్( Google ) ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ తీసుకు వస్తూ వినియోగదారులను ఖుషీ చేస్తోంది.ఇక టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ సైబర్ థ్రెట్స్, హ్యాకింగ్ అనేది ఏ తీరుగా జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు.
అలాంటి ప్రమాదాలనుండి ప్రజలను రక్షించేందుకు ఆయా కంపెనీలు ప్రత్యేక ఫీచర్‌లను అందిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అన్ని రకాల థ్రెట్స్ నుంచి సెక్యూరిటీ కల్పిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
గూగుల్ఐ/ఓ (గూగుల్ I/O) 2023 డెవలపర్ ఈవెంట్‌లో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్ లేటెస్ట్ ప్రొడక్ట్స్, టెక్నాలజీలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఫీచర్లను పరిచయం చేసింది.కాగా వాటిలో ‘అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్( unknown tracker alerts )’ ఫీచర్ ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక తాజాగా దీనిని గూగుల్ లాంచ్ చేయడం మొదలు పెట్టింది.ఆండ్రాయిడ్ 6.0, అంతకన్నా ఎక్కువ వెర్షన్ వాడుతున్న మొబైల్యూజర్లందరికీ గూగుల్ ఈ కొత్త భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది.సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా, లేదంటే రీస్టార్ట్ చేసి సెట్టింగ్స్‌లో చెక్ చేయడం ద్వారా ఈ అప్‌డేట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.వినియోగదారుల ప్రైవసీకి భంగం వాటిల్లుతోంది.ఈ అతిపెద్ద సమస్యకు పరిష్కారంగా అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్ స్పెసిఫికేషన్‌ను ఈ నెల నుంచి లాంచ్ చేయడం గూగుల్ ప్రారంభించింది.ఈ టూల్ యూజర్‌కు తెలియకుండానే వారితో పాటే ఉంటూ వారిని ట్రాక్ చేసే సమీప బ్లూటూత్ డివైజ్‌లను గుర్తిస్తుందన్నమాట.

ఇపుడు యూజర్‌కు ఆటోమేటిక్‌గా ‘అన్‌నోన్ ట్రాకర్ డిటెక్టెడ్’ అనే ఒక నోటిఫికేషన్ పంపించి ఫలానా బ్లూటూత్ డివైజ్ ట్రాక్ చేస్తున్నట్లు అలర్ట్ చేస్తుంది.అపుడు ఏం చేయాలంటే ఆ బ్లూటూత్ ట్రాకింగ్ డివైజ్‌ను( Bluetooth tracker ) డిసేబుల్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్ ఫీచర్ సెండ్ చేసే నోటిఫికేషన్‌పై నొక్కితే సరిపోతుంది.ట్రాక్ చేసే వారికి తెలియకుండా ట్రాకర్‌ను గుర్తించడంలో వీలుగా ట్రాకర్‌లో సౌండ్‌ను ప్లే చేయగల ‘ప్లే సౌండ్’ అనే ఒక బటన్ కూడా యూజర్లకు అందుబాటులో ఉంటుంది.ఈ ఫీచర్ ట్రాకింగ్ పరికరాల నుంచి యూజర్ ప్రైవసీ సేఫ్టీని మెరుగుపరుస్తుంది.
‘అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్’ ఫీచర్ ప్రస్తుతం యాపిల్ AirTagsతో మాత్రమే పని చేస్తుంది.భవిష్యత్తులో ఇతర ట్రాకింగ్ ట్యాగ్‌లకు ఈ అప్‌డేట్‌ను విస్తరించడానికి ఇతర ట్యాగ్ తయారీదారులతో సహకరించాలని కంపెనీ యోచిస్తోంది.