జంతు ప్రదర్శన శాలలో( animal exhibition hall ) కొన్నిసార్లు ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి.జంతువులను చూసి ఆనందించే సమయంలో కొన్నిసార్లు సందర్శకులు బలైపోతూ వుంటారు.
ఎందుకంటే కొంతమంది ఔత్సాహికులు పులులు, సింహాలతో ఆడుకోవాలని చూస్తూ వుంటారు.అయితే ఇలాంటి పిచ్చి చేష్టలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారి ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.
ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అవును, యువతి జుట్టు వెరైటీగా ఉండడం చూసి ఓ ఒంటె తినేందుకు ప్రయత్నం చేసింది.
విషయంలోకి వెళితే, పిల్లాడిని ఎత్తుకుని జూకు వెళ్లిన మహిళకు ఊహించని అనుభవమే ఎదురైంది.జంతువులను చూసే క్రమంలో ఆమె ఓ ఒంటె వద్దకు వెళ్తుంది.దానిని మరింత దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో కంచెకు దగ్గరగా వెళ్తుంది.
ఆమె జుట్టు రింగు రింగులు తిరిగి వెరైటీగా ఉండడంతో.ఒంటె కంటికి తినే పదార్థంలా కనిపించినట్లుంది.
దాంతో ఎలాగైనా తినేయాలనే ఉద్దేశంతో మహిళ జుట్టును( Woman’s hair ) నోటితో గట్టిగా పట్టుకుంటుంది.ఒంటె( camel ) ఇలా చేయడంతో ఆమె చేతిలో ఉన్న పిల్లాడు కూడా భయపడిపోతాడు పాపం.
ఒంటె నుంచి తప్పించుకోవడానికి ఆమె చాలా ట్రై చేస్తుంది.అయినా ఒంటె మాత్రం జుట్టు వదలకుండా పట్టుకుంటుంది.
అయితే చివకు ఎలాగోలా ఒంటె నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోతుంది.
ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దాంతో దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు ”ఆమె జుట్టు.ఫాస్ట్ ఫుడ్‌లా కనిపించిందేమో!” అని కామెంట్స్ చేస్తే, మరికొందరు….”వీడియో తీస్తున్న వ్యక్తి అలా చోద్యం చూస్తూ ఉండకపోతే వెళ్లి కాపాడొచ్చుగా?” అని కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే ”జంతువల దగ్గర జాగ్రత్తగా ఉండాలి సుమా!” అని కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ వీడియో ప్రస్తుతం 32వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకొని రికార్డ్ దిశగా అడుగులు వేస్తోంది.