రాజన్న సిరిసిల్ల జిల్లా:క్షయ వ్యాధి( Tuberculosis ) నుండి తమకు తాము రక్షించుకోవాలని వ్యాధి నిర్ధారణ చేసుకొని మందులు వాడుతూ మరొకరికి సోకకుండా జాగ్రత్త పడాలని డాక్టర్ స్రవంతి రెడ్డి పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం రాచర్ల తిమ్మాపూర్, గుండారం, బాకూరుపల్లి తండాలో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటుచేసి సుమారు 40 మంది అనుమానితుల నుండి తెమడను తీసి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ కు పంపించి పరీక్షలు పరీక్షలు నిర్వహించామన్నారు.
నలుగురికి వ్యాధి నిర్ధారణ అయినట్లు డాక్టర్ స్రవంత్ రెడ్డి తెలిపారు.
దగ్గు, దమ్ము లాంటి సమస్యలు ఉంటే వెంటనే తమ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అదేవిధంగా క్షయ ఒక అంటూ వ్యాధని ఒకరితో మరొకరికి వ్యాపిస్తుందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, పోషక ఆహారాలు( Nutritious foods ) తినాలని, వ్యాయామం చేస్తూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలన్నారు.ఈ వైద్య శిబిరంలో టిబి ల్యాబ్ సూపర్వైజర్ నాగరాజు, ఏఎన్ఎం ప్రవీణ కుమారి,సువర్ణ, ఆశా కార్యకర్తలు వాణి, తార,సుజాత అదేవిధంగా గ్రామ సర్పంచ్ పడగల రవీందర్ పాల్గొన్నారు.