టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.అలాగే కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇకపోతే సమంతకు సాకి( Saaki ) అనే పేరుతో గార్మెంట్స్ బ్రాండ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇందులో ప్రత్యేకించి ఉమెన్స్ వేర్ లభిస్తాయి.
ఈ బ్రాండ్ ని చాలా కాలంగా సమంత నడుపుతున్నారు.ఈ సంస్థ ద్వారా వచ్చే లాభాలు సమంత చారిటీస్, సోషల్ వర్క్ కోసం ఖర్చు చేస్తోంది.
కాగా తాజాగా సాకీ బ్రాండ్ న్యూ కలెక్షన్ ని ప్రోమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
కాగా ఒకవైపు సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.దీంతో ఈ ఏడాది పాటు ఆమె సినిమాలు చేస్తారా చేయరా అన్న విషయాల్లో సందేహం నెలకొంది.ఆ వార్తలు నిజమే అంటూ సమంత హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ కన్ఫర్మ్ చేశాడు.
చిక్సిత సమయంలో ఆమెకు శక్తి, మనోధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలి.సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.
మయోసైటిస్( Myositis ) బారిన పడిన సమంత ఈ ఏడాది ప్రారంభం నుండి యాక్టివ్ గా ఉంటున్నారు.ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు.
ఖుషి చిత్ర షూటింగ్( Kushi Movie ) ద్రాక్షారామం షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది.ఇక సిటాడెల్( Citadel ) షూటింగ్ జులై 13న పూర్తి చేసింది.
ఇక సమంతకు అమెరికాలో జరిగే చికిత్సకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.అలా ఒకవైపు ఆరోగ్యంతో పోరాడుతూనే మరొకవైపు ఇలా తన బ్రాండ్స్ ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తుంది సమంత.కొంతమంది ఈ విషయంపై మండిపడుతుండగా మరికొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.తన బ్రాండ్స్ ని ఆమె ప్రమోట్ చేస్తోంది డబ్బులు కావాలి అంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అంటూ కొందరు సమంతకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.