యంగ్ హీరో రానా( Rana ) ప్రస్తుతం తెలుగు లో చేస్తున్న సినిమా లు ఏంటి అంటే ఠక్కున సమాధానం వచ్చే పరిస్థితి లేదు.విరాటపర్వం సినిమా( Virataparvam movie ) తర్వాత రానా సినిమా ఏదీ లేదు.
విరాటపర్వం సినిమా కి కూడా దాదాపు మూడు సంవత్సరాల సమయం తీసుకున్నారు.రానా అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆమధ్య మొత్తం సినిమా లను పక్కన పెట్టిన విషయం తెల్సిందే.
మళ్లీ ఇప్పుడు పరిస్థితి అదే తరహా లో ఉంది.
ఆమధ్య తేజ ( Teja )దర్శకత్వం లో రాక్షస రాజు( rakshasa raju ) అనే సినిమా ను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.రెండు పార్ట్ లో సినిమా వస్తుందని కూడా వార్తలు వచ్చాయి.అయితే అభిరామ్ హీరోగా నటించిన అహింస సినిమా తో తేజ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.
అందుకే రానా రాక్షస రాజు సినిమా విషయం లో వెనుకంజ వేస్తున్నాడా అంటే ఔను అనే సమాధానం లభిస్తుంది.హీరో గా రానా తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ లో కూడా సుపరిచితుడు అనే విషయం తెల్సిందే.
అందుకే ఇప్పుడు హిందీ లో ఒక సినిమా ను చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.తెలుగు సినిమా కంటే ముందు ఒక హిందీ సినిమా ను చేయాలని రానా భావిస్తున్నాడు.
అందుకోసం స్క్రిప్ట్ వింటున్నాడని తెలుస్తోంది.హీరో గా రానా హిందీ లో చేయాలనుకుంటున్న సినిమా గురించి వచ్చే నెలలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై స్పష్టత రావాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది.రానా తెలుగు సినిమా ల పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు.
కానీ హిందీ లో మాత్రం సినిమా ప్లానింగా చేస్తున్నాడు.రానా ఇక్కడ కాకుండా అక్కడ ఎందుకు సినిమా చేస్తున్నాడు.
ఇంతకు రానా ప్లానింగ్ ఏంటి అంటూ ఇండస్ట్రీకి చెందిన మీడియా వారు ఇంకా ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.