మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో కిడ్నాప్ కు గురైన గురైన నాలుగేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది.తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పాప కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలోనే నిందితుడు సురేశ్ తో పాటు పాప కృష్ణవేణిని పోలీసులు గుర్తించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణా షాపుకు వెళ్లిన పాప కనిపించకుండా పోయింది.అయితే చిన్నారిని సమీపంలో ఉన్న జగదాంబ థియేటర్ లో పని చేసే సురేశ్ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే సీసీ టీవీ పుటేజ్, డాగ్ స్వ్కాడ్ తో విస్తృతంగా గాలించారు.నిందితుడిని పట్టుకోవడంతో పాప ఆచూకీ తెలిసింది.
దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.