యాప్స్‌ను మానవులతో పాటు రోబోలు కూడా వాడుతున్నాయి.మనిషిలా ఆలోచించే రోబోలు కూడా వివిధ రకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నాయి.
ఐఆర్‌ఎల్ అన యాప్( IRL APP )ను వాడే యూజర్లలో 95 శాతం రోబోలే( ROBOS ) ఉన్నాయట.దీంతో ఆ యాప్‌ను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018లో అబ్రహం షఫీ అనే వ్యక్తి ఐఆర్‌ఎల్ సంస్థను ఏర్పాటు చేశాడు.వ్యవస్థాపకుడిగా.
సీఈవోగా ఆయన వ్యవహరిస్తున్నారు.ఒకప్పుడు ఈ యాప్ విలువ రూ.98 వేల కోట్లుగా ఉంది.దాదాపు 20 వేల మిలియన్ల మంది యూజర్లు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నట్లు వ్యవస్థాపకుడు అబ్రహం షపీ చెబుతున్నాడు.

అయితే వివిధ సంస్థ నుంచి రూ.20 కోట్ల ఫండ్ వచ్చేలా అబ్రహం షఫీ మేనేజ్ చేశాడు.అయితే ది ఇన్‌ఫర్మేషన్ నివేదికలు యాప్ ప్రకటన సంఖ్యలను ప్రశ్నిస్తూ వచ్చింది.ఈ విచారణలో గణాంకాలు పూర్తిగా నకిలీవి అని తేలింది.దీంతో కంపెనీలో కొనసాగేదే లేదని వాటాదారులు తప్పుకున్నారు.దీంతో ఈ యాప్ పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.
పెట్టుబడిదారుల డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు.అయితే ఆఫ్‌లైన్ కనెక్షన్స్ ట్రిగ్గర్ చేయాలనుకునే జెన్-Z ఫోకస్డ్ యాప్ గా ఇది పిచ్ చేయబడింది.

ఎక్కువమంది వ్యక్తులతో కలిసి ఉండటం, భాగస్వామ్య ఆసక్తితో సమాజాన్ని నిర్మించడం, స్నేహితులుగా మారడంలో ఈ యాప్ సహాయపడుతుంది.ఇతర యాప్స్ కు భిన్నంగా ఇది ఉంటుందని 2022లో సీఈవో, ఫౌండర్ అబ్రహం షఫీ( Abraham Shafi ) ఫోర్బ్స్ తో చెప్పుకొచ్చాడు.అయితే ప్రకటనలు., గణాంకాలు ఫేక్ అని తెలియడంతో కంపెనీ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టర్ అబ్రహం షఫీని సస్పెండ్ చేయాల్సి వచ్చింది.దీంతో అప్పటినుంచి కంపెనీ నష్టపోతూ వస్తుండటంతో.మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో పాపులారిటీ సంపాదించుకున్న యాప్ ఇక కనిపించడం లేదు.