అక్కినేని హీరో నాగార్జున ( Nagarjuna )గత ఏడాది ఘోస్ట్ ( Ghost ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ సినిమా తరువాత నాగార్జున ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.ఈయన తన తదుపరి సినిమా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తో ఉండబోతుందని వార్తలు వచ్చాయి.
అయితే ఆ ప్రాజెక్టులోకి రవితేజ రావడంతో నాగార్జున మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా నాగార్జున గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ఒకవైపు సినిమా చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్( Web Series ) లలో కూడా నటిస్తూ డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నాగార్జున సైతం డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.ఇలా నాగార్జున డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈయన ఇకపై సినిమాలకు దూరమవుతారని తెలుస్తుంది.ఇప్పటికే నెట్ ఫ్లిక్స్l ( Net Flix ) వారు నాగార్జునని కలిసి ఒక సిరీస్ కోసం ఆయనని సంప్రదించడంతో నాగార్జున కూడా ఈ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పారని సమాచారం.
ఇక ఈ సిరీస్ దాదాపు పది ఎపిసోడ్స్ ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సిరీస్ నాగార్జునకు సరైన కథతోనే మొదలవబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సిరీస్ నాగార్జున రైటర్స్ కూడా భాగమయ్యారని సమాచారం.దీన్ని బట్టి చూస్తుంటే నాగార్జున ఇకపై సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తూ డిజిటల్ మీడియాకి పరిమిత అవుతారని తెలుస్తుంది.
అయితే ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు.చాలామంది హీరోలు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు.నాగార్జున కూడా అలాగే నటించవచ్చు కదా వెబ్ సిరీస్ ల కోసం సినిమాలకు దూరం అవడం ఏంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మరి నాగార్జున గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.