మనవరాలు జాతకం అద్భుతం... చిరంజీవి కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) మరోసారి తాత అయ్యారు.రాంచరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana ) దంపతులకు కుమార్తె జన్మించడంతో చిరంజీవి సంతోషంలో ఉన్నారు.

 Granddaughter's Horoscope Is Amazing, Chiranjeevi, Baby Girl, Ramcharan, Upasana-TeluguStop.com

పెళ్లయిన 10 సంవత్సరాలకు తన కొడుకు కోడలు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ముందుగా చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.అయితే తమ ఇంటికి ఎప్పుడెప్పుడు వారసుడు లేదా వారసురాలు వస్తారా అని ఎదురుచూస్తున్నటువంటి ఆరోజు రానే వచ్చింది.

మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు ( Baby Girl ) జన్మనిచ్చారు.ఇక ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.

ఇక ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలియడంతో వెంటనే చిరంజీవి అపోలో హాస్పిటల్ కి వెళ్లి తన మనవరాలిని చూసి ఎంతో సంబరపడిపోయారు.ఇలా తన మనవరాలిని చూసిన అనంతరం చిరంజీవి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయన తన మనవరాలు గురించి ఎంతో గొప్పగా చెప్పారు.మాకెంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున మా మనవరాలు జన్మించిందని సంతోషం వ్యక్తం చేశారు.

మంగళవారం ఉదయం 1:49 గంటలకు పాప పుట్టింది.చాలా మంచి గడియలలో జన్మించిందని తన జాతకం ఎంతో అద్భుతంగా ఉందని చిరంజీవి తెలియచేశారు.అయితే పాప జాతకం ముందు నుంచి మా ఇంటి పై ప్రభావం చూపుతోందని చిరంజీవి తెలిపారు.రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎదుగుదల మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అలాగే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ( varun Tej Engagment )జరగడం ఇలా మా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయని, పాప జాతక ప్రభావం మా ఇంటి పై పడిందంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన మనవరాలి జాతకం అద్భుతంగా ఉందంటూ మురిసిపోతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube