వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్లు ప్రారంభం..2 స్థానాల కోసం 10 జట్ల మధ్య పోటీ..!

భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ( ODI World Cup )జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు నేరుగా 8 జట్లు అర్హత సాధించాయి.

 Odi World Cup Qualifier Matches Start.. Competition Between 10 Teams For 2 Plac-TeluguStop.com

మరో రెండు జట్లు క్వాలిఫయర్ మ్యాచ్ల ద్వారా అర్హత సాధించనున్నాయి.నేటి నుంచి 10 జట్ల మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించిన జట్లు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్.

నేటి నుంచి జింబాబ్వే( Zimbabwe ) వేదికగా జూన్ 18 నుంచి జూలై 9 వరకు క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనున్నాయి.రెండు స్థానాల కోసం పోటీపడే పది జట్లు ఏవేవంటే.జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, నేపాల్, యూఎస్ఏ, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ.

అయితే ఈ పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.ఇందులో టాప్-2 లో ఉండే రెండు జట్లు వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.

క్వాలిఫైయర్ మ్యాచ్లలో ప్రతి గ్రూప్ లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ కు అర్హత సాధిస్తాయి.

జింబాబ్వే వేదికగా 34 క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి.ఈ మ్యాచ్లు అన్నీ జింబాబ్వే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, బులవాయో అథ్లెటిక్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ బులవాయో అనే నాలుగు వేదికలపై జరగనున్నాయి.నేడు క్వాలిఫైయర్ రౌండ్ లో తొలి మ్యాచ్ జింబాబ్వే -నేపాల్ ( Nepal )మధ్య జరగనుంది.

ఇక పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.ఇక ఏ రెండు జట్లు వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయో.

మ్యాచులు ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube