మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్ల్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ గ్లింప్స్ కు ఏకంగా 17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఈ గ్లింప్స్ మహేష్ అభిమానులకు తెగ నచ్చేసింది.గ్లింప్స్ లో త్రివిక్రమ్ స్టైల్ కనిపిస్తుందని మహేష్ బాబు మరింత అందంగా కనిపిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ అ అనే అక్షరంతో మొదలవుతాయనే సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం గమనార్హం.
అయితే ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత మహేష్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.ఈ ఇద్దరు హీరోలలో మాస్ హీరో( Mass Hero ) ఎవరంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం.
మాస్ అంటే మహేష్ బాబు అని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేయడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టారు.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇండియన్ సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లగా మహేష్ బాబు ఒక ప్రముఖ ఛానల్ లోని సీరియల్ ను ప్రమోట్ చేశాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.మహేష్, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి గొడవలు లేవనే సంగతి తెలిసిందే.
మహేష్, తారక్ జోక్యం చేసుకుంటే మాత్రమే ఫ్యాన్స్ మధ్య వివాదాలు ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది.ఈ ఇద్దరు హీరోలు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అనవసర వివాదాలను సృష్టించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని చెబుతున్నారు.
మహేష్, ఎన్టీఆర్ లకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.