2026 తర్వాత లోక్సభలో డీలిమిటేషన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలను కేటాయించాలని ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది అయితే ఈ విధానం వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని రాజకీయాలకతీతంగా దక్షిణాది నేతలు అంతా ఈ విషయంలో ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు బారాసా జాతీయ కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు( Kalvakuntla Taraka Rama Rao ).కేంద్రం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలైన కేరళ ,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని లోక్సభలో వీటి ప్రాతినిధ్యo తగ్గిపోతుందని ,ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జనాభా నియంత్రణను సమగ్రంగా అమలు చేసిన ఈ రాష్ట్రాలు తమ జనాభా సంఖ్యను తగ్గించుకున్నాయని, జనాభాపరంగానే కాక మానవ అభివృద్ధి సూచికల్లో కూడా ఈ రాష్ట్రాలు ముందున్నాయి.దేశ జనాభాల్లో 18 శాతం ఉన్న దక్షిణాది జనాభా 35% స్థూల జాతీయ ఉత్పత్తికి నిధులు అందిస్తుంది.ప్రగతిశీల విధానాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన బహుమతి సరైనది కాదని ఆయన చెప్పుకొచ్చారు అభివృద్ధికి బహుమానం ఇవ్వాల్సిన చోట ,శిక్షించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం విధానం ఉందని దీనిపై మన వానిని వినిపించాలని రాజకీయాలు ప్రాంతీయ విబేదాలు పక్కనపెట్టి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుమేరకే దక్షిణాది రాష్ట్రాలు జనాభా సంఖ్యను తగ్గించుకున్నాయని, ఇప్పుడు జనాభా ఆధారంగా లోక్సభ ప్రాతినిధ్యం కల్పిస్తామనడం న్యాయం కాదని ఆయన చెప్పుకొచ్చారు.రాష్ట్రాలు వారి పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రాతినిధ్యం కూడా అలాగే ఉండాలని కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడం కోసమే కేంద్రం ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తుందని ఆయన మండిపడ్డారు.తమ బలం ఎక్కువగా ఉన్నచోట అధిక సీట్లను కేటాయించడం ద్వారా దీర్ఘకాలం అధికారంలోకి ఉండాలనే స్వార్థ ప్రయోజనాల కోసమే కేంద్రం ఇలాంటి నిబంధనలు తీసుకొస్తుందని ఆయన దుయ్యబట్టారు .