జనసేనకు ప్లాన్ బి సిద్ధంగా ఉందా ??

మహానాడు వేదికగా జనసేన -తెలుగుదేశం పొత్తులపై కూడా స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించిన జన సైనికులకు నిరాశ ఎదురయింది.సభ ఆద్యంతం కూడా ఎక్కడా కూడా జనసేన( Jana sena ) ప్రస్తావన గురించి గాని పొత్తుల గురించి గానీ తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా మాట మాత్రం గా ప్రస్తావించలేదు.

 Is Janasena Has Plan B , Janasena, Pawan Kalyan, Ap Politics , Tdp, Mahanadu, Ch-TeluguStop.com

కనీసం తీర్మానం లో నైనా పొత్తు అవసరం అన్న దిశగా ప్రకటిస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు.అచ్చన్నలాంటి వారైతే తెలుగుదేశం 160 సీట్లు ఒంటరిగా గెలుస్తుందంటూ అతిశయోక్తి మాటలు చెప్పారు.

తద్వారా జనసేన ను సైడ్ చేసి కార్నర్ చేసే పరిణామాలు జరుగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది .చాలాకాలం క్రితమే పొత్తులపై తేల్చేసిన జనసేనా ని పొత్తులు కచ్చితంగా ఉంటాయని జగన్ ను( YS Jagan Mohan Reddy ) గద్దించడమే లక్ష్యం అంటూ ప్రకటించారు.తద్వారా పొత్తుల విషయంలో చాలా అడుగులు ముందుకు వేశారు .ఇప్పుడు ముందుకు రావాల్సింది తెలుగుదేశం మాత్రమే.అయితే ఆ పార్టీ నాయకులు చాలా వ్యూహాత్మకంగా ముందుకు అడుగేస్తున్నట్లుగా తెలుస్తుంది .

Telugu Ap, Chandra Babu, Janasena, Mahanadu, Pawan Kalyan, Ys Jagan-Telugu Polit

నిజానికి వాస్తవ పరిస్థితి చూస్తే జనసేన అవసరం తెలుగుదేశానికి ఉంది తప్ప తెలుగుదేశం( TDP ) అవసరం జనసేనకు లేదు .రూపాయి డబ్బు అవసరం లేకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోగల అభిమాన సామర్థ్యం జనసేనకు ఉంది .ఆ పార్టీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నిలబడి ఉందంటే నిస్వార్ధమైన జనసైనికుల కష్టంతో మాత్రమే చెప్పాలి.కానీ తెలుగుదేశం పరిస్థితి అలాకాదు .మరొకసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకమవుతుంది./br>

Telugu Ap, Chandra Babu, Janasena, Mahanadu, Pawan Kalyan, Ys Jagan-Telugu Polit

ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఎలానో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా అని జనసేనను లైట్ తీసుకున్నట్లుగా టిడిపి పెద్దల తీరు ఉందన్నట్టు తెలుస్తుంది.మరి ఈ విషయాలన్నీ నిశితం గా గా పరిశీలిస్తున్న జనసేన పెద్దలు ప్లాన్ -బి కూడా సిద్ధం చేసుకుని ఉంచాలనుకున్నట్లుగా తెలుస్తుంది .బీజేపీతో ఎలాగో మంచి సంబంధాలు ,పొత్తు అధికారికంగా ఉంది కాబట్టి దానిని బలోపేతం చేసుకోవటం మీదే దృష్టి పెట్టాలని ఎన్నికలు దగ్గరలో తెలుగుదేశం గౌరవప్రదమైన పొత్తు వ్యూహం సిద్దం చేస్తే , తమకు బలం ఉన్నచోట సీట్లు ఇస్తే అప్పుడు చూసుకుందాం అన్నట్లుగా ప్లాన్ -బి సిద్ధం చేసుకుని ఉంచారని తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube