నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది.
పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది సీఆర్ జయ సుకిన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను కొట్టివేస్తామని తెలిపింది.
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని లోక్ సభ సెక్రటేరియట్ ఉల్లంఘించిందని దాఖలు చేసిన పిటిషన్ ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.కాగా ఈ ప్రారంభోత్సవంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య గత కొన్ని రోజులగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.