స్మార్ట్ ఫోన్ అనేది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తుందని యూజర్లకు తెలిసినప్పటి నుండి ప్రైవసీ కోసం యాప్స్ అన్నీ నానాతంటాలు పడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.
కొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి కూడా.దాంతో గూగుల్ ( Google ) కూడా వారి బాటలోనే నడుస్తోంది.
ఇప్పటికే ప్రైవసీ విషయంలో గత కొన్నిరోజులుగా ఎన్నో కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టిన గూగుల్ ఇప్పుడు ఒకేసారిగా చాలామంది జీమెయిల్ అకౌంట్లను( Gmail ) డిలీట్ చేయడం స్టార్ట్ చేసింది.ఇదంతా గూగుల్ కొత్త పాలసీలో( Google New Policy ) భాగమే అని యాజమాన్యం ప్రకటించింది.
ఇందులో భాగంగానే జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలలో కూడా ఎన్నో అకౌంట్స్ డిలీజ్ కానున్నాయి అని ముందస్తుగానే సమాచారం అందించింది గూగుల్.అయితే దీని వల్ల జీమెయిల్ యూజర్లు ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని యాజమాన్యం చెబుతోంది.ఈ పాలసీ అనేది కేవలం ఇనాక్టివ్ యూజర్లను మాత్రమే టార్గెట్ చేస్తుందని చెబుతోంది.అంటే రెండేళ్లకు పైగా ఎవరైతే జీమెయిల్ అకౌంట్‌ను ఉపయోగించడం లేదో వారు అకౌంట్లు మాత్రమే డిలీట్ కానున్నాయని గూగుల్ ప్రకటించింది.
అంటే మీరు ఒకప్పుడు జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయింటే ఆ అకౌంట్ ఇప్పుడు డిలీట్ అయిపోతుందని అర్థం చేసుకోండి.అంతేకాకుండా మీరు ఎప్పుడో ఓపెన్ చేసిన మల్టీ జిమెయిల్ అకౌంట్లు వాడని యెడల అవి కూడా డిలీట్ చేయబడుతుంది.ఈ ఏడాది డిసెంబర్ నుండి ఈ పాలసీ ప్రారంభం కానుందని చెప్పింది.కేవలం పర్సనల్ అకౌంట్లకు మాత్రమే ఈ పాలసీ అప్లై అవుతుందని గూగుల్ తెలిపింది.ఒకవేళ అది బిజినెస్ అకౌంట్ అయితే మాత్రం డిలీట్ అయ్యే అవకాశం లేదని యాజమాన్యం చెప్తోంది.