టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లు రాహుల్, శాంతి, సుచరితను అధికారులు విచారిస్తున్నారు.
మరోవైపు నిందితులను కోర్టు మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించింది.ఈ నేపథ్యంలో చంచల్ గూడ నుంచి నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
యుజర్ ఐడీ, పాస్ వర్డ్ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలుస్తోంది.దీంతో కస్టోడియన్ శంకర్ లక్ష్మీపై అనుమానాలు బలపడుతున్నాయి.
అయితే ఇప్పటివరకు శంకర్ లక్ష్మీని సిట్ అధికారులు సాక్షిగా పరిగణించారు.అదేవిధంగా ఈ వ్యవహారంలో మొత్తం 37 మందిని సిట్ అరెస్ట్ చేసింది.







