పేర్ని కిట్టు కి జగన్ ఆమోదం దక్కిందా?

బందర్పోర్టు శంకుస్థాపన సందర్భంగా పేర్ని నాని( Perni Nani ) చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ పార్టీలో( YSRCP party ) కలకలం రెపాయని తెలుస్తుంది .తనకు ఇదే చివరి మీటింగ్ అని జగన్తో కలిసే ఛాన్స్ భవిష్యత్తులో వస్తుందో లేదో అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసిన ఆయన అందుకే కాసేపు ఎక్కువ మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు.

 Perni Nani Plotical Retirment Details, Perni Nani,perni Kittu,ap Political Lates-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టు( Perni Kittu ) పోటీ చేస్తారని సీఎం సమక్షంలో ప్రకటించిన ఆయన రాజకీయాలకు విరమణ ప్రకటించేశారు.అయితే వచ్చే ఎన్నికలు హారోహరీగా జరుగుతాయని ఈసారి విజయం సాధిస్తే మరొక 30 సంవత్సరాలు తామే అధికారంలోకి ఉండే అవకాశం ఉందని జగన్ ( CM Jagan )ఇటీవల చాలా సార్లు కార్యకర్తలు మరియు నాయకులతో వ్యాఖ్యానించారు.

మరి అలాంటి కీలక ఎన్నికలకు కొత్తవారికి అవకాశం ఇచ్చి రిస్క్ తీసుకోకూడదని పాత అభ్యర్థులతోనే పోటీ చేయాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు .

Telugu Ap Latest, Perni Kittu, Pernikittu, Perni Nani, Perninani-Telugu Politica

తమ వారసుల కు టికెట్లు ఇప్పించుకోవాలని అధికార పార్టీలో చాలామంది నేతలు క్యూ లో ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తమ పార్టీకి తిరిగి ఉండదని అందువల్ల మీ అభ్యర్థనలను వచ్చే ఎన్నికలకు నెరవేరుస్తానని జగన్ చాలా మందిని సముదాయించారు మరిప్పుడు పేర్ని కిట్టుకు గనక టికెట్ కేటాయిస్తే పార్టీలో అసంతృప్తి స్వరాలు మరి కొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మచిలీపట్నంలో మూడు సార్లు విజయ కేతనo ఎగరవేసిన పేర్ని నానికి నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది .తాను యాక్టివ్ గా ఉండగానే కొడుకును గెలిపించి అతని రాజకీయానికి బవిష్యత్తుకు బాటలు పరచాలని కోరిక ఆయనకు ఎక్కువగా ఉంది.దా నికి తగ్గట్టుగానే అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలలో కూడా ఆయన కుమారుడు పేర్ని కిట్టు చురుకుగా పాల్గొంటున్నారు కరోనా సమయంలో కూడా చాలామందికి వైద్య సేవలు అందించడంలో ఆయన కృషి చేశారని అక్కడి కార్య కర్తలు చెబుతున్నారు .

జగన్ ఆమోదం లేకుండా ఆయన సమక్షంలో పేర్నినాని ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదని అందువల్ల పేర్ని కిట్టు కి స్పష్టమైన హ్యామి లభించింది కాబట్టే ఆయన ఈ రకంగా బయటపడ్డారని కూడా కొంతమంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube