125 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న చెట్టు.. ఎక్కడుందో తెలుసా?

అదేంటి, ఓ చెట్టు 125 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించడం ఏమిటి, మీ పిచ్చి కాకపోతే? అనే అనుమానం కలుగుతోంది కదూ.ఎన్ని అనుమానాలు కలిగినా ఇక్కడ మీరు విన్నది అక్షరాలా నిజం.

 A Tree Under Arrested For 125 Years In Pakistan Details, Tree , Viral Latest, Ne-TeluguStop.com

కొన్ని సార్లు చేయని తప్పులకు జనాలు ఎక్కువగా శిక్షలు ఏళ్లతరబడి మరీ అనుభవిస్తూ వుంటారు.ఈ క్రమంలో ఏళ్ల తరబడి బందీలుగా ఉంటారు.

అయితే.మనుషులకు అది సర్వ సాధారణమైన విషయం అనుకోవాలి.

కానీ, ఇదే సమస్య ఓ చెట్టుకు( Tree ) కూడా వచ్చింది.అవును, ఆ చెట్టు చేయని తప్పుకు కొన్నేళ్ల నుంచి బందీగా ఉంది.

గొలుసులతో కట్టేసి మరీ ఓ మర్రి చెట్టును( Banyan Tree ) బందీ చేశారు అక్కడి జనాలు.అది కూడా పదేళ్ళో, ఇరవయ్యేల్లో కాదండీ, ఏకంగా 125 ఏళ్లు ఆ చెట్టుని ఓ కారాగారంలో బందీని చేసినట్టు బంధించారు.ఈ క్రమంలో దానికి గొలుసులు కూడా వేయడం జరిగింది.ఇక్కడ ఫోటోని గమనిస్తే మీకే అర్ధం అవుతుంది.ఇది జరిగింది ఎక్కడో కాదు.పాకిస్థాన్‌లోని( Pakistan ) లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోగా తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది.

అక్కడ ఉన్న ఓ మర్రిచెట్టుకు ఇప్పటికీ సంకెళ్లు వేసి ‘ఐయామ్ అండర్ అరెస్టెడ్’ అని బోర్డుని తగిలించారు.అసలు ఆ మర్రిచెట్టును ఎందుకు అరెస్టు చేశారంటే.1898లో అఖండ భారతం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ ఆర్మీ అధికారి ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉండగా ఆ చెట్టు తనవైపు దూసుకొస్తున్నట్లుగా భ్రమ చెందాడట పాపం.దీంతో హుటాహుటిన ఆ మర్రిచెట్టును అరెస్టు చేయమని సార్జెంట్లను మనోడు ఆదేశించగా అలా అరెస్టైన ఆ చెట్టు ఇప్పటికీ అలాగే గొలుసులతో కట్టి ఉండడం ఒకింత విడ్డురమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube