బంగారం తక్కువ ధరకు దొరికితే ఎవరికి వద్దు చెప్పండి.మనదగ్గర కాదుగానీ, కువైట్( Kuwait ) లో బంగారు కాస్త తక్కువ ధరకు లభించడంతో అక్కడినుండి స్వదేశాలకు వచ్చిన వారు బంగారాన్ని( Gold ) కొనుగోలు చేస్తూ వుంటారు.
అయితే అక్కడినుండి బంగారు కడ్డీలతో ప్రయాణించే వారు తప్పనిసరిగా కువైట్ విమానాశ్రయంలో ఎయిర్ కార్గో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుండి స్టేట్‌మెంట్ పొందాలని కస్టమ్స్ అధికారులు నిక్కచ్చిగా చెబుతున్నారు.కాగా ఈ చట్టం పౌరులు, నివాసితులందరికీ వర్తిస్తుంది.
అవసరమైన కస్టమ్స్ విధానాల( Customs ) తర్వాతనే కొనుగోలు చేయవలసి ఉంటుంది.ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది ప్రయాణికులు పెద్ద మొత్తంలో బంగారాన్ని విదేశాలకు తీసుకెళ్లడం ప్రారంభించిన నేపథ్యంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.ఒక వ్యక్తి బంగారంతో ప్రయాణిస్తున్నాడంటే, అతను తన డబ్బు విలువను బంగారంగా మార్చుకున్నాడని మాత్రమే అర్థం అని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.కాబట్టి ప్రయాణీకుడు ప్రయాణ సమయంలో తన వద్ద ఉన్న బంగారం యాజమాన్యాన్ని రుజువు చేసే పత్రాలు మరియు అతని స్వంత గుర్తింపు పత్రాలతో ప్రయాణానికి ఒక రోజు ముందు ఎయిర్ కార్గో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్( Air Cargo Customs Department )ను సంప్రదించవలసి ఉంటుంది.
దీనర్ధం విమానంలో ఎంత బంగారం తీసుకెళ్తున్నారో వారికి రుజువు చేసుకోవాలి.ఇక్కడి నుంచి అనుమతి పత్రాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ల ముందు అందజేస్తేనీ ఇక వారి ప్రయాణం సజావుగా సాగుతుంది లేదంటే, దబిడి దిబిడే.కడ్డీలు, నాణేల రూపంలో బంగారం పెద్దదైనా, చిన్నదైనా అధికారులకు చూపించి స్టేట్‌మెంట్‌తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఆధీనంలో ఉన్న బంగారం ప్రయాణీకుడిదేనని రుజువు చేసే పత్రాలు తప్పనిసరి.
లేని యెడల స్టేట్‌మెంట్‌లో ప్రయాణికుడు చేర్చిన కొనుగోలుకు సంబందించిన ఇన్‌వాయిస్, బంగారం అక్రమంగా సంపాదించబడిందని రుజువు చేస్తూ కటకటాల వెనక్కి నెడతారు జాగ్రత్త!
.