డింపుల్ హయతి( Dimple Hayathi ).ఈమె ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం అయ్యింది.
విజయవాడకు చెందిన ఈ తెలుగు బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మొహమాటం చూపించదు.అందుకే ఈమెకు అవకాశాలు వరించాయి.
గల్ఫ్ సినిమాతో ఈమె సినీ ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈ సినిమా వచ్చింది కూడా ఎవ్వరికి తెలియదు.
ఇక ఆ తర్వాత చాలా రోజులకు హరీష్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్( Gaddalakonda ganesh mlovie ) సినిమాలో ఈమె చేసిన స్పెషల్ సాంగ్ వల్ల బాగా పాపులర్ అయ్యింది.ఆ తర్వాత ఖిలాడీ ( Khiladi movie )సినిమాలో రవితేజ సరసన నటించే అవకాశం అందుకుంది.ఇటీవలే గోపీచంద్ నటించిన రామబాణం సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరించింది.ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాట్ బ్యూటీపై ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసు నమోదు అవ్వడం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు.ఇంతకీ ఈమె అంతగా ఏం చేసింది? ఎవరితో గొడవ పడింది తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
డింపుల్ హయతి ప్రజెంట్ హైదరాబాద్ లోని ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది.ఇదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఒక పోలీస్ అధికారితో ఈమెకు గత కొన్ని రోజులుగా పార్కింగ్ విషయంలో గొడవ జరుగుతుంది.హైదరాబాద్ లో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న రాహుల్ హెగ్డే ఇదే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు.
ఆయన ప్రభుత్వ వాహనాన్ని డింపుల్ ఇప్పటికే పలు సార్లు తన కారుతో పదే పదే తన్నింది అని ఇక తాజాగా డింపుల్ కు కాబోయే భర్త డేవిడ్( Devid ) పోలీస్ కారును ఢీ కొట్టడంతో గొడవ పెద్దది అయ్యిందట.
దీంతో రాహుల్ ( Rahul )ఈ విషయంలో ఈమెకు ఎన్నిసార్లు చెప్పిన వినలేదని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట.వీరు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.
ఈ విషయంలో డింపుల్, డేవిడ్ లను హెచ్చరించి నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది.