మరో లెవల్లో 'జై శ్రీరామ్' ఫుల్ సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తుందిగా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’( Adipurush ) ఒకటి.ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Prabhas Adipurush Jai Shri Ram Full Song Details, Prabhas, Adipurush, Jai Shri-TeluguStop.com

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నారు.

ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా నుండి ”జై శ్రీరామ్”( JAI SHRI RAM ) అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ చేసారు.ఈ సాంగ్ కు కూడా ఆడియెన్స్ నుండి భారీ స్పందన లభించింది.ఇక ఇప్పుడు జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.ప్రోమో అప్పుడే రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం అజయ్ – అతుల్ సంగీతంలో మిళితం అయ్యి జై శ్రీరామ్ అనే సాంగ్ గూస్ బంప్స్ తెప్పించింది.

ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరో లెవల్లో ఉంది అనే చెప్పాలి.

ముంబై లో ఏర్పాటు చేసిన లైవ్ ఆర్కెస్ట్రా లో అజయ్ – అతుల్ ఈ సాంగ్ ను పడడంతో గూస్ బంప్స్ వచ్చాయి.ఈ సాంగ్ విజువల్ గా ఎలా ఉంటుందా అని ఇప్పుడు అందరిలో ఉత్సాహం నెలకొంది.

ఇప్పుడు ఈ సాంగ్ అయితే మరో చార్ట్ బస్టర్ ఖాయంగా కనిపిస్తుంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.

సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో.

https://youtu.be/J7IuQSZdzYw
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube