అయ్యో బేబమ్మ ఎంత పనైంది... ఇక దిక్కెవరు?

ఉప్పెన( Uppena ) సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి( Krithi Shetty ) ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్‌ లను సొంతం చేసుకుని ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ గా మారి పోయిన విషయం తెల్సిందే.హీరోయిన్ గా వరుసగా సక్సెస్ లను దక్కించుకున్న కృతి శెట్టి అంతే స్పీడ్ గా వరుస ఫ్లాప్‌ లను మూట కట్టుకుంది.

 Uppena Heroine Krithi Shetty Not Getting Good Offers Details,krithi Shetty,naga-TeluguStop.com

కథ మరియు కథనం విషయంలో ఇప్పటి వరకు ఆమె ఎంపిక చేసుకున్న సినిమాల పై శ్రద్ద పెట్టినట్లుగా అనిపించలేదు.

తాజాగా కస్టడీ సినిమా( Castady movie ) తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది.

మినిమం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్‌ ఎక్కాలని భావించిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.మెప్పించలేక పోయింది.తన నటనతో పాటు గ్లామర్‌ విషయంలో కూడా ఈ అమ్మడి యొక్క షో కు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కృతి శెట్టి యొక్క అందాల ఆరబోత ను అభిమానులు ఆశిస్తున్నారు.కానీ ఆమె నుండి మాత్రం అది దక్కలేదు.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు.అంతే కాకుండా ఈ బేబమ్మ యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ కూడా సోషల్‌ మీడియా లో ఎక్కువ రావడం లేదు.

అందుకే సినిమా ల్లో ముందు ముందు అయినా ఈమె ఎక్కువ ఫోకస్ అయ్యి మెప్పిస్తుందా అనేది చూడాలి.తెలుగు మరియు తమిళం లో ఈమె కి ఒకటి రెండు ఆఫర్లు ఉన్నాయి.

మరి వాటితో మళ్లీ పుంజుకుంటుందా కనిపించకుండా పోతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube