నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కస్టడీ( Custody )… ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి.తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో నిర్మించడం, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు.
ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు విడుదలయి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది .ఇక కలెక్షన్స్ కూడా సాధారణంగానే ఉన్నట్టు తెలుస్తుంది .
ఓవర్సీస్‌లో ఓ మోస్తారు ఓపెన్సింగ్ కనిపించాయి.ఈ చిత్రం అమెరికాతోపాటు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో ప్రీమియర్లతోపాటు రెగ్యులర్ షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి.అమెరికాలో( America ) భారీగా రిలీజ్ చేయగా .యూకే, ఆస్ట్రేలియాలో అక్కడి రేంజ్‌కు తగినట్టుగా రిలీజ్ చేశారు .ఆస్ట్రేలియాలో 18 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి.ఇక యూకేలో సుమారు 19 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.
అయితే గతంలో థ్యాంక్యూ సినిమాకు( Thank you ) వచ్చిన రెస్పాన్స్ కూడా రావడం లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అమెరికాలో కూడా కస్టడీకి ఓ మోస్తారు రెస్సాన్స్ కనిపించింది.ఈ సినిమాను దాదాపు 125 లొకేషన్లలో ప్రదర్శించారు .తొలి రోజు పాతికవేల డాలర్లు వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.హైదరాబాద్‌లో కస్టడీ సినిమా 60 లక్షల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొంత మేర రానట్టయింది .నైజం , సీడెడ్ , ఆంధ్ర ఇలా అన్ని చోట్ల కాస్త డీసెంట్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం .మొత్తం మీద కస్టడీ మొదటి రోజున బాక్సాఫీస్ వద్ద దాదాపు 4 కోట్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.కస్టడీ చిత్రం పెద్దగా పోటీని ఎదుర్కోవడం లేదు .అది ఈ చిత్రం కలెక్షన్లు పెరగడానికి సహాయపడుతుంది.సినిమాకు కొంత పాజిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వసూళ్లు పెరగడం ఖాయం .దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో కస్టడీని రూపొందించారని అంచనా.మరి ఏ సినిమా అంత మొత్తం ఏ మేరకు రాబడుతుంది అనేది చూడాలి.