జాలి కోసం ఏడ్చే పిరికిదానిని కాదన్న అనసూయ.. విజయ్ పై కోపానికి అదే కారణమంటూ?

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ( Anchor Anasuya ) సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో పాటు నెగిటివ్ కామెంట్లకు తనదైన శైలిలో బదులివ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఇన్ స్టాగ్రామ్ లో సుధీర్ఘ పోస్ట్ పెట్టిన అనసూయ ఆ పోస్ట్ లో నువ్వు ఎవరో నీకు తెలుసని నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకు ఇలాగే చేస్తుంటానని ఆమె అన్నారు.

 Anchor Anasuya Shocking Post On Vijay Devarakonda Goes Viral In Social Media Det-TeluguStop.com

నా విషయంలో ఏది చేశావో దానిని మరిచిపోకుండా నీకు గుర్తు చేస్తూనే ఉంటానని అనసూయ తెలిపారు.

ఈ విధంగా చేయడం వల్ల పెద్ద ఎత్తున నెగిటివిటీని ( Negativity ) ఎదుర్కొంటానని నాకు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు.

అయినప్పటికీ నిజం, మంచితనం, భగవంతుడిపై నాకు నమ్మకం ఉందని అనసూయ పేర్కొన్నారు.వాటి నుంచి నేను మరింత శక్తిని పొందుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఏడ్చి గగ్గోలు పెట్టి సానుభూతి పొందాలని నేను భావించడం లేదని దానికి నేను వ్యతిరేకినని అనసూయ వెల్లడించారు.

Telugu Anasuya, Anasuya Trolls, Anchor Anasuya-Movie

నాపై బురద జల్లినా నన్ను కిందికి లాగినా నా పోరాటం మాత్రం ఆగదని అనసూయ అన్నారు.వీటన్నింటికీ అర్థం చెప్పడానికి ఒకరోజు వస్తుందని నేను భావిస్తున్నానని అమె పేర్కొన్నారు.పని లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నానని అనుకోవద్దని ఇది నా బాధ్యత అని ఆమె తెలిపారు.

నువ్వు నాలోని ఒక తల్లిని టార్గెట్ చేశావని ఆ తల్లి ఎంత ధైర్యవంతురాలో నీకు చూపిస్తానని అనసూయ వెల్లడించారు.

Telugu Anasuya, Anasuya Trolls, Anchor Anasuya-Movie

విజయ్ దేవరకొండపై( Vijay Devarakonda ) పగకు సంబంధించి అనసూయ తన పోస్ట్ ద్వారా కొన్ని విషయాలను చెప్పకనే చెప్పేశారు.విజయ్ చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఆమె హర్ట్ అయ్యారని అందుకే అనసూయ ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది.విజయ్ అనసూయ మధ్య సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.

అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube