యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాను సెప్టెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.
అక్టోబర్ లేదా నవంబర్ లో హిందీ సినిమా యొక్క షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉంది.అందుకే సమ్మర్ హీట్ ను కూడా డామినేట్ చేసే విధంగా తన యాక్షన్ సన్నివేశాలతో ఎన్టీఆర్ కుమ్మేస్తున్నాడు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ మరియు ఇతర నటీనటుల యొక్క కాంబో సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

ఇప్పుడు ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) యొక్క కాంబో సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమ్మర్ హీట్ కి జాన్వీ కపూర్ దాదాపు మూడు వారాల పాటు ఎన్టీఆర్ తో కలిసి షూట్ లో పాల్గొనాల్సి ఉంటుందట.అదే జరిగితే జాన్వీ కపూర్ ఎండలకు మాడి పోతుందేమో పాపం అంటూ కొందరు ఈ సందర్భంగా ఆమె గురించి కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క జోరు మామూలుగా ఉండదు.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం.ఇలాంటి అందాల ముద్దుగుమ్మ ఎండలో ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కొరటాల శివ( Koratala Siva )ఈ అమ్మడి యొక్క అందాలను ఏ స్థాయి లో చూపిస్తాడో చూడాలి.
జాన్వీ కపూర్ మొదటి సారి తెలుగు లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా తో టాలీవుడ్ లో మంచి హిట్ దక్కితే కచ్చితంగా ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎన్టీఆర్ తో నటిస్తున్న జాన్వీ కపూర్ ఆయన తో డాన్స్ చేసేందుకు తెగ కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.