బీజేపీకి నితీశ్ తోనే ముప్పు ?

కేంద్రంలో మోడిని గద్దె దించడమే టార్గెట్ గా విపక్షాలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.వచ్చే ఎన్నికలతో ఎలాగైనా మోడికి చెక్ పెట్టి సంకీర్ణ ప్రభుత్వం తీసుకు రావాలని విపక్షాలన్నీ ఏకం అయ్యేందుకు సిద్దమయ్యాయి.

 Is Nitish Kumar A Threat To Bjp? , Akhilesh Yadav , Bjp , Nitish Kumar ,hemant-TeluguStop.com

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్( Congress party ), ఆమ్ ఆద్మీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్.ఇలా ప్రతి పార్టీ కూడా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీ, కే‌సి‌ఆర్, వంటి వాళ్ళు విపక్షలను ఏకం చేయడంలో ముమ్మర ప్రయత్నాలు చేశారు.కానీ సమన్వయ లోపంతో అందరిని ఏకీకృతం చేయడంలో వీరిద్దరు విఫలం అయ్యారనే చెప్పాలి.

అటు డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆ దిశగా కొంతమేర ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు కనిపించలేదు.

Telugu Akhilesh Yadav, Congress, Hemant Soren, Narendra Modi, National, Nitish K

ఎవరికి వారు ఏకం కావాలని చెబుతున్నా అందరు కలిసి మాత్రం ముందుకు రావడం లేదు.ఇదే విపక్షాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్ళీ ఆ దిశగా ప్రయత్నలు చేస్తున్నారు.

గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న నితీశ్ బీజేపీకి (Nitish Kumar ) షాక్ ఇస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆర్జేడి తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అప్పటి నుంచి కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

అయితే ఆ మద్య సైలెంట్ గా ఉన్న నితీశ్ ఇటీవల వరుసగా విపక్ష నేతలతో సమావేశం అవుతూ అందరిని ఏకీకృతం చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Akhilesh Yadav, Congress, Hemant Soren, Narendra Modi, National, Nitish K

ఆ మద్య అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ( Akhilesh Yadav ) వంటి వారిని కలిసిన నితీశ్ ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తో బేటీ అయ్యారు.వచ్చే ఎన్నికలలో బీజేపీ కుతంత్రలను తిప్పికొడడం అంటూ పిలుపునిస్తున్నారు.కాగా దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న నితీశ్ కుమార్ ఇదే విధంగా చొరవ చూపుతూ ముందుకు సాగితే విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే సరైన సమయాల్లో చేతురత ప్రదర్శించి ప్రత్యర్థుల కుయుక్తులను చిత్తు చేయడంలో నితీశ్ కుమార్ ది అందె వేసిన చేయి.బిహార్ లో జేడీయూ ను కుల్చాలని ప్లాన్ చేసిన బీజేపీ వ్యూహాలకు ఊహించని విధంగా తిప్పికొట్టి ఏకంగా బద్ద శతృత్వం కల్గిన ఆర్జేడి తోనే చేతులు కలిపి ప్రభుత్వాన్ని స్థాపించారు నితీశ్ కుమార్.

అందువల్ల విపక్షలను ఏకం చేయడంలో నితీశ్ చొరవ చూపితే అది.బీజేపీకి పెను ముప్పే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube