రాష్ట్ర అధికారంపై సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాస్వామ్యం గెలిచిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.సుప్రీంకోర్టు నిర్ణయంతో ఢిల్లీ అభివృద్ధి వేగం పెరగనుందని స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.పాలనను కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడానికి వీలులేదని సీజేఐ పేర్కొంది.
జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వానిదేనని వెల్లడించిన సంగతి తెలిసిందే.







