అంతులేని కథ, కుక్క కాటుకు చెప్పుదెబ్బ, నాలాగా ఎందరో అనే సినిమాల్లో నటించిన హేమ సుందర్( Hema Sundar ) గుర్తున్నాడా ? అయన ఒక సీనియర్ యాక్టర్.అయితే అయన ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తే వారు వ్యూస్ కోసం 400 సినిమాల్లో నటించి 80 ఏళ్ళ వయసులో ఇంకా స్కూటర్ పైన( Scooter ) తిరుగుతున్న నటుడు అంటూ థంబ్నెయిల్ పెట్టి విడుదల చేసారు.
దాంతో అందరు బాగానే ఆ వీడియోస్ ని చూసారు.కానీ హేమ సుందర్ తన ఇంటర్వ్యూ లో తాను చాల బాగున్నానని, ఆర్థికంగా సమస్యలు లేవని చెప్పాడు.
మరి స్కూటర్ పైన తిరగడం గురించి మాట్లాడుతూ నా ఒక్కడి ప్రాణానికి కార్ ఎందుకు అండి.ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ లో కారు తీసుకొని బయటకు వెళ్తే సరైన టైం లో చేరాల్సిన ప్లేస్ కి చేరలేం అంటూ సమాధానం చెప్పాడు.
హేమ సుందర్ చెప్పిన సమాధానానికి ఖంగు తిన్న యాంకర్ ఇంకా నోరు తెరవలేదు.అయన చెప్పిన ఫిలాసఫీ ఎంతో నిజం.కారు లో వెళ్లడం, స్కూటర్ పైన వెళ్లడం లేదా నడిచి వెళ్లడం అనేది ఎవరి అవసరాన్ని బట్టి వారి ఉపయోగం.
అంతే కానీ వాడే వస్తువులు, వెళ్తున్న వాహనాలను బట్టి తప్పు పడితే ఎలా చెప్పండి.పైగా ఇది పెద్ద కుటుంబాలు కారును స్టేటస్ సింబల్ గా మార్చి అది రిచ్ లైఫ్ స్టైల్ అని ఫాలో చేస్తున్నారు తప్ప, ఒకరు వెళ్ళడానికి చిన్న వాహనం సరిపోతుంది.మార్కెట్ లో మాయాజాలం చేస్తే కానీ ఏది ఎవరికి స్టేటస్ సింబల్, ఏ తరగతి వారు ఎలాంటి వాహనాలు వాడాలి అని అర్ధం కాలేదు.
అర్ధం అయ్యే సరికి పేద వారికి సైకిల్, మధ్య తరగతి వారికి టూ వీలర్, హై లెవల్ వాలు కార్లు అని డిసైడ్ అయిపోయారు.
కాస్త మన జెనరేషన్ నుంచి వెనక్కి వెళ్తే మన తండ్రులు, వారి తండ్రులు అందరూ సైకిల్స్ మీద, స్కూటర్ల మీద తిరిగిన వారే.మొన్నటికి మొన్న హీరో విజయ్( Hero Vijay ) సైకిల్ పై వచ్చి వోట్ వేస్తే సింప్లిసిటీ అని పొగిడిన పాత్రికేయ మిత్రులు ఎవరైనా నిన్నటి తరం వారు రోడ్ పై కనిపిస్తే మాత్రం నిన్నటి తరం నటుడి అద్వాన్న స్థితిలో అంటూ థంబ్ నైల్ పెట్టేస్తారు…కలి కాలం కదా మరి.!