ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య బారిన పడుతున్నారు.ఈ క్రమంలోనే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారు.
అయితే జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టుకు దూరంగా ఉండవచ్చు.వయసు పైబడిన సరే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పెరుగు ( CURD )వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee powder ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని మరోసారి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలి అని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి పొందడానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.కాబట్టి ఈ రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి.
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి.