ఇటీవలే జరుగుతున్న దారుణాలను చూస్తే కాస్త విచిత్రంగా అనిపిస్తాయి.కొన్ని విషయాలు కళ్ళతో చూసేంత వరకు నిజం అని ఒప్పుకోవడం కూడా కష్టమే.
వివాహేతర సంబంధం( Illegal Relationships ) వల్ల భర్త లేదా భార్య హత్యకు గురవడం చాలా సందర్భాల్లో వినే ఉంటాం.అందుకు భిన్నంగా భర్త సహాయంతో ప్రియుడిని హతమార్చిన భార్య( Wufe ) కథ వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.
భర్త డబ్బు సంపాదించడం కోసం విదేశాలకు వెళ్ళాడు.ఒంటరిగా ఉన్న భార్య ఓ అపరిచిత వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
కానీ ఆ వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో చివరకు భర్తను పిలిపించి ప్రియుడిని హత్య చేయించింది.
వివరాల్లోకెళితే.
బీహార్ లోని( Bihar ) గోపాల్ పూర్ పరిధిలో ఉండే నట్వాన్ గ్రామానికి చెందిన మహమ్మద్ సాహెబ్ అన్సారీ కు అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో ఏడాదిన్నరగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.మహిళ భర్త దుబాయిలో ఉంటున్నాడు.
అయితే మహమ్మద్ సాహెబ్ డబ్బు కోసం అసభ్యకర ఫోటోలు తీసి మహిళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.ఆ ఫోటోలు వైరల్ చేస్తాడనే భయంతో చాలా సార్లు డబ్బులు కూడా ఇచ్చింది.
కానీ మహమ్మద్ సాహెబ్ వేధించడం ఎక్కువ కావడంతో ఆ మహిళా భర్తకు ఫోన్ చేసి అన్ని నిజాలు చెప్పేసింది.

మహిళా భర్త దుబాయ్ నుంచి లక్నో చేరుకొని అక్కడి నుండి రాత్రి నట్వాన్ లోని తన ఇంటికి చేరుకున్నాడు.ఏప్రిల్ 26న మహిళ ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి పిలిచింది.కుట్ర గురించి తెలియని మహమ్మద్ సాహెబ్ అన్సారీ మహిళ ఇంటికి రాగానే అతని ఒక గదిలో బంధించి, అర్ధరాత్రి మహిళా భర్త, బావమరిది కలిసి హత్య చేశారు.
అనంతరం మృతి దేహాన్ని బైక్ పై భగవాన్ పూర్ సమీపంలోని కాలువలో పడేశారు.

పోలీసులు టెక్నికల్ సెల్ సహాయంతో సిట్ దర్యాప్తు ప్రారంభించగా.మహమ్మద్ సాహెబ్ తో ఆ మహిళ పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా గుర్తించి తమదైనశీలిలో ఆ మహిళను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిందితులైన ఆమె బావ అజయ్ సింగ్, మహిళ తండ్రి బలి రామ్ సింగ్ లను సిట్ అరెస్ట్ చేసింది.
ఇక రాత్రికి రాత్రి దుబాయ్ పారిపోయిన భర్త వీరేంద్ర సింగ్ పాస్పోర్ట్ రద్దు కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయబడుతుందని.నిందితుడిని తిరిగి స్వదేశానికి రప్పించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.







